BSNL Cheapest Plan : BSNL చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ. 51కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 28 రోజులు ఎంజాయ్..
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన 28 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాతో సహా అనేక బెనిఫిట్ అందిస్తుంది.
- Sreehari A
- Updated on- May 23, 2026 / 11:39 AM IST
BSNL Cheapest Plan
- బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన 28 రోజుల ప్లాన్
- రూ. 51తో రీఛార్జ్ చేస్తే ఫ్రీ నేషనల్ రోమింగ్
- అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఫ్రీ SMS
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే. అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాతో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ సరసమైన ప్లాన్ కేవలం రూ. 51కే అందిస్తోంది. ఈ అద్భుతమైన ప్లాన్ ద్వారా ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్, డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. పూర్తి ప్లాన్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
అత్యంత చౌకైన ప్లాన్ 28 రోజులు :
బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 51కే అందిస్తుంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల పాటు ఫ్రీ నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఈ ప్లాన్‌తో యూజర్లకు కొత్త సిమ్ కార్డ్ పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది.
New connection. Smart savings. Stronger network.
Get started with the BSNL Freedom Offer at just ₹51/- and enjoy:
* Daily 2GB Data/ Day
* 100 SMS/ Day
* FREE BSNL SIM
* 28 Days Validity
* Unlimited CallingBecause every smart start deserves a reliable connection.
Available… pic.twitter.com/hnQFQbNUrB
— BSNL India (@BSNLCorporate) May 22, 2026
జూన్ 30 వరకు వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 51 ప్లాన్‌లో మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ 2GB డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2026, మే 22 నుంచి జూన్ 30 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. యూజర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థ గత ఏడాదిలో ఫ్రీడమ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1 ప్లాన్ ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్ల కోసం ఈ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దేశమంతటా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
