BSNL Promotional Offer : BSNL లిమిటెడ్ ప్రీపెయిడ్ ఆఫర్.. ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి..!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.2,399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది.
- Sreehari A
- Updated on- December 31, 2021 / 07:44 PM IST
Bsnl
BSNL Promotional Offer : దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.2,399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకునే యూజర్లు మరో 60 రోజులు అదనంగా వ్యాలిడిటీని పొందవచ్చు. ప్రస్తుత వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో కలిపి మొత్తంగా 425 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అన్ లిమిటెడ్ లోకల్, STD వాయిస్ కాలింగ్ కాల్స్, రోజుకు 3GB హైస్పీడ్ డేటా అందిస్తోంది.
అంతేకాదు.. ఫ్రీగా BSNL Tunes కూడా యాక్సస్ చేసుకోవచ్చు. Eros Now ద్వారా పాపులర్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ హర్యానా డివిజన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
డిసెంబర్ 31 (శుక్రవారం వరకు) అంటే ఈ రోజు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ కేవలం హర్యానా సర్కిల్ లో మాత్రమే కాదు.. ఇతర అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ తమిళనాడు వెబ్ సైట్ సహా ఇతర బీఎస్ఎన్ఎల్ సర్కిల్ వెబ్ సైట్లలోనూ ఈ అడిషనల్ వ్యాలిడిటీ ఆఫర్ అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ అందించే రూ.2,399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ పై మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్, రోజుకు 100SMSలు పొందవచ్చు. రోజు 3GB హైస్పీడ్ డేటాను ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీ డేటా లిమిట్ దాటితే 80Kbps స్పీడ్ కు తగ్గిపోతుంది. అప్పుడు యూజర్ FUP పాలసీ కింద డేటాను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
Read Also : Milk Price Hike : రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. లీటర్‌పై రూ.2 పెంపు
