Milk Price Hike : రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. లీటర్‌పై రూ.2 పెంపు

సామాన్యులపై మరో భారం పడింది. పాల ధరలు పెరిగాయి. లీటర్ పాలపై రూ.2 పెంచింది. లీటర్ హోల్ మిల్క్ పైనా రూ.4 పెంచింది. కొత్త ధరలు..

Milk Price Hike : రాష్ట్రంలో పెరిగిన పాల ధరలు.. లీటర్‌పై రూ.2 పెంపు

Milk Price Hike

Milk Price Hike : అసలే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరో భారం పడింది. పాల ధరలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ సంస్థ.. పాల ధరలను పెంచింది. లీటర్ టోన్డ్ మిల్క్ పై రూ.2 పెంచింది. లీటర్ హోల్ మిల్క్ పైనా రూ.4 పెంచింది. కొత్త ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ చెప్పింది.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

మరోవైపు 200 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై 50 పైసలు, 300 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూపాయి చొప్పున పెంచినట్లు విజయ పాల డెయిరీ సంస్థ ప్రకటించింది. అటు 500 మి.లీటర్ల డైట్ మిల్క్‌పై రూపాయి పెంచినట్లు సంస్థ తెలిపింది.

Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్టు సంస్థ వివరించింది. దయచేసి వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ కోరింది.