BSNL Prepaid Plans : BSNL బంపర్ ప్లాన్లు.. ఒక్క రీఛార్జ్‌తో డేటా డబుల్ + ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్.. ఈ తేదీ వరకే..!

BSNL Prepaid Plans : బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఫ్రీ బోనస్ డేటాను ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. పూర్తి ప్లాన్ ఆఫర్ వివరాలివే..

BSNL Prepaid Plan

  • బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బోనస్ డేటా ఆఫర్
  • రూ. 997 ప్లాన్‌పై 5GB అదనపు డేటా పొందొచ్చు
  • రూ. 1999 ప్లాన్‌తో 10GB బోనస్ డేటా కూడా

BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫాదర్స్ డే 2026 సందర్భంగా తమ యూజర్ల కోసం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు మొబైల్ డేటాను అందిస్తోంది.

ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్కువ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం (BSNL Prepaid Plans) చూస్తున్న కస్టమర్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ #RechargeForPapa అనే సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

Read Also : POCO C81 Pro : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో C81 ప్రో వచ్చేసింది.. 256GB స్టోరేజీ ఫోన్ జస్ట్ రూ. 16వేలకే..!

కంపెనీ ప్రకారం.. ఈ ఆఫర్‌లో రూ. 997, రూ. 1999తో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బోనస్ డేటా అందిస్తోంది. ఈ అదనపు డేటా కోసం ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ జూన్ 21, 2026 నుంచి ప్రారంభమై జూన్ 30, 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బోనస్ డేటా కోసం కస్టమర్లు ఈ వ్యవధిలోపు రీఛార్జ్ చేసుకుంటే చాలు..

బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫాదర్స్ డే సందర్భంగా కస్టమర్‌లు ఈ ప్లాన్‌పై అదనంగా 5GB డేటా కూడా పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ :
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్‌లు రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కంపెనీ 10GB బోనస్ డేటా కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ వ్యవధిలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లకు బెస్ట్ అని చెప్పొచ్చు.