BSNL Super Star Plan : BSNL బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 799కే 5000GB హైస్పీడ్ డేటా.. ఏడాదంతా ఎంజాయ్.. మార్చి 31 వరకే ఛాన్స్!
BSNL Super Star Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అద్భతమైన ఆఫర్.. మార్చి 31లోగా రూ. 799కే ప్రీమియం సూపర్ స్టార్ ప్లాన్ తక్కువ ధరకే లభిస్తోంది. 5000GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది.
- Sreehari A
- Published On : March 30, 2026 / 06:51 PM IST
BSNL Super Star Plan
- బీఎస్ఎన్‌ఎల్ సూపర్ స్టార్ ప్రీమియం ప్లాన్ ఆఫర్
- ఈ నెల 31 వరకు మాత్రమే ప్లాన్ అందుబాటులో
- ఓటీటీ ప్లాన్ అసలు ధర రూ. 999, 20శాతం డిస్కౌంట్
- రూ. 799 చెల్లిస్తే చాలు.. 200Mbps స్పీడ్, 5000GB హైస్పీడ్ డేటా
BSNL Super Star Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. తక్కువ చెల్లించండి.. ఎక్కువ డేటాను పొందండి.. మీరు జస్ట్ రూ. 800 కన్నా తక్కువ ధరకే 200Mbps ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు.
ప్రభుత్వం టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మీకోసం అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రీమియం ప్లాన్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే, ఈ ఆఫర్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ధర ఎంతంటే? :
బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ ఓటీటీ ప్లాన్ ధర నెలకు రూ. 999గా ఉంది. అయితే, 12 నెలల ప్లాన్‌ను ముందుగానే చెల్లించే వారికి 20శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో అసలు ధర నెలకు రూ. 799కి తగ్గుతుంది.
లాంగ్ వ్యాలిడిటీపై ఆఫర్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ 6 నెలలు లేదా 12 నెలల వ్యాలిడిటీతో వస్తుంది. ఒక నెలకు ధర రూ. 999. 6 నెలలకు ధర రూ 5994. అయితే, మీరు 12 నెలల ఆప్షన్‌ను ఎంచుకుంటే.. 12 నెలల అడ్వాన్స్ చెల్లింపుపై మీకు 20శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు కేవలం రూ. 9590 చెల్లిస్తే చాలు.. నెలవారీ ఖర్చు రూ. 799 అవుతుంది.
హైస్పీడ్, హై డేటా డేటా :
ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యూజర్లకు 5000GB వరకు డేటాతో 200Mbps వరకు ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. డేటా కోటా పూర్తయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 10Mbpsకి పడిపోతుంది.
ఫ్రీ ల్యాండ్‌లైన్ కనెక్షన్ :
బీఎస్ఎన్ఎల్ అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అన్ లిమిటెడ్ కాలింగ్ కోసం ఫ్రీ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కాలింగ్ కోసం ఫ్రీ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు ల్యాండ్‌లైన్ డివైజ్ నేరుగా కొనాల్సి ఉంటుంది.
ఫ్రీ OTT సర్వీసులు :
ఈ ప్లాన్‌తో పాటు అనేక ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా జియోహాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్‌గేట్, హంగామా, షెమరూ, ఎపికాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సస్ పొందవచ్చు.
ఆఫర్ గడువు :
ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. గడువుకు ముందే రీఛార్జ్ చేసుకోండి. కంపెనీ వెబ్‌సైట్, యాప్, దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి ఈ ఆఫర్ గురించి మరింత తెలుసుకోవచ్చు. వాట్సాప్‌లో 18004444 నంబర్‌కు “Hi” అని పంపి కూడా వినియోగదారులు రీఛార్జ్ చేయొచ్చు.
