Samsung Galaxy S26 : ఇది కదా డిస్కౌంట్.. రూ.88వేల శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?
Samsung Galaxy S26 : శాంసంగ్ గెలాక్సీ ఎస్26పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.87,999 ఫోన్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.83,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్లు, కెమెరా, ధర వివరాలివే..
- Sreehari A
- Updated on- November 16, 2026 / 09:19 AM IST
Samsung Galaxy S26 Price
- శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
- రూ.87,999 శాంసంగ్ ఫోన్ ఇప్పుడు రూ.83,999కే..
- 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో శాంసంగ్ ఫోన్
Samsung Galaxy S26 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకో అద్భుతమైన అవకాశం. ప్రీమియం ఫీచర్లు, ఆకట్టుకునే కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన డీల్స్‌తో అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై లభిస్తున్న బ్యాంక్ ఆఫర్లతో ప్రారంభ ధర కన్నా తక్కువకే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S26 5జీ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.87,999కు లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.4వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
Read Also : Jio Google AI Pro : జియో యూజర్లకు బిగ్ షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో గూగుల్ ఏఐ ప్రో బంద్.. వారికి మాత్రమే..!
దీంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.83,999కు చేరుతుంది. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.57,200 వరకు అదనపు బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫీచర్లు కూడా అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్‌పై కంటెంట్ చూడటం, గేమ్స్ ఆడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5తో వస్తుంది..
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. ప్రైమరీ, టెలిఫోటో కెమెరాలకు OIS సపోర్ట్ కూడా ఉంది. వై-ఫై 7, బ్లూటూత్ 5.4, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కేవలం 167 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంపర్ట్ ఉంటుంది.
