ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్లు.. రూ.15,000లోపే వచ్చే 3 మోటోరోలా బెస్ట్ ఫోన్లు ఇవే..
తక్కువ ధరలో 5G డివైస్ కావాలనుకునేవారికి ఇది అద్భుత అవకాశమని చెప్పుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025లో మోటోరోలా ఫోన్లు డిస్కౌంట్‌లో అందుబాటులో ఉన్నాయి. శక్తిమంతమైన ప్రాసెసర్, భారీ ర్యామ్, మంచి కెమెరా ఉన్న ఫోన్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ చూడండి..
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ జూలై 17న అర్ధరాత్రి ముగియనుంది. వెంటనే కొంటేనే మీకు ఈ ఆఫర్లు అందుతాయి. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025లో మోటోరోలా ఫోన్లు డిస్కౌంట్‌లో ఉన్నాయి.
ఈ ఫోన్లపై డిస్కౌంట్
మోటోరోలా G85 5G, G45 5G, G35 5G లాంటి పాపులర్ స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్‌లో వస్తున్నాయి. రూ.15000 లోపు ఉండే బడ్జెట్ కేటగిరీలో ఈ ఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తక్కువ ధరలో 5G డివైస్ కావాలనుకునేవారికి ఇది అద్భుత అవకాశమని చెప్పుకోవచ్చు.
మోటోరోలా G85 5G
120Hz రిఫ్రెష్‌రేట్ ఉన్న హైఎండ్ లో కాస్ట్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా G85 5G. Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో 12GB RAM, 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000, డైరెక్ట్ డిస్కౌంట్ రూ.2000. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.14999. 50MP OIS మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ డ్యూయల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP52 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది.
మోటోరోలా G45 5G
మోటోరోలా G45 5G తక్కువ ధరలో బాగా పనిచేసే స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో ధర రూ.10999. బ్యాంక్ డిస్కౌంట్ తో రూ.9999కి దొరుకుతుంది. MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌తో 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉంది. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీకి 20W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌కు IP52 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది.
మోటోరోలా G35 5G
తక్కువ ధరకే వచ్చే ఫోన్ మోటోరోలా G35 5G. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9999, 5% బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. 50MP డ్యూయల్ కెమెరా సెట్‌అప్, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీకి 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Android 14తో వస్తుంది. IP52 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది.