AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్.. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు, పూర్తి వివరాలు
AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ లో భాగంగా జూలై 10 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. జూలై 14తో గడువు పూర్తవగా జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులోకి రావాల్సి ఉంది.

AP ICET Counselling 2025 Web Options Started
ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ లో భాగంగా జూలై 10 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. జూలై 14తో గడువు పూర్తవగా జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ వెబ్ అప్షన్ల ప్రక్రియ జులై 16 నుంచి మొదలయ్యింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జులై 21 వరకు కాలేజీల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు జులై 22తో ముగుస్తుంది.
ఇక జూలై 25వ తేదీన ఐసెట్ – 2025 మొదటి ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు అధికారులు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 26 నుంచి తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం జూలై 28వ తేదీని గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆయా కాలేజీలలో రిపోర్టింగ్ చేసుకోకపోతే కేటాయించిన సీటు క్యాన్సిల్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.