Croma Valentine Day Sale : వాలెంటైన్స్ డే సేల్.. ఈ ఆపిల్ ఐఫోన్ 17పై ఖతర్నాక్ డిస్కౌంట్, జస్ట్ రూ. 47వేలకే, ఎలాగంటే?
Croma Valentine Day Sale : ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గిందోచ్.. క్రోమా వాలెంటైన్స్ డే సేల్ సమయంలో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ లిమిటెడ్ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : February 13, 2026 / 02:12 PM IST
Croma Valentine Day Sale : ఆపిల్ ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్. ఐఫోన్ 17 అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఐఫోన్ 17 మోడల్ లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. వాలెంటైన్స్ డే సేల్ సమయంలో ఈ ఆపిల్ ఐఫోన్ 17 రూ. 47,742కే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉండదు. ప్రస్తుత క్రోమా వాలెంటైన్స్ డే సేల్‌లో ఐఫోన్ 17పై అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
క్రోమాలో ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 15, 2026 వరకు వాలెంటైన్స్ డే సేల్ జరుగుతోంది. ఈ డీల్ సందర్భంగా ఐఫోన్ 17 ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 17 అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.2,000 బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
అలాగే, రూ. 8వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుంటే అదనంగా రూ. 23,500 సేవ్ చేసుకోవచ్చు. రూ.1,658 డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. అన్ని ఆఫర్లతో కలిపి ఐఫోన్ 17 రూ. 47,742కు లభిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు : ఆపిల్ నుంచి లేటెస్ట్ ఐఫోన్ 6.1-అంగుళాల ప్రోమోషన్ సూపర్ XDR స్క్రీన్ అందిస్తుంది. ఫోన్ డిస్‌ప్లే ద్వారా 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. కంపెనీ OLED ప్యానెల్ అందిస్తుంది. ఈ ఐఫోన్‌కు పవర్ అందించే A19 బయోనిక్ చిప్‌సెట్, ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో వస్తుంది. డ్యూయల్-బ్యాండ్ వైఫై కనెక్టివిటీ, రెండు 5G సిమ్ కార్డులకు సపోర్టు చేస్తుంది. అలాగే, ఐఫోన్ USB టైప్-C, బ్లూటూత్, NFC వంటి కనెక్టివిటీని కూడా అందిస్తుంది.
కెమెరాతో పాటు ఐఫోన్ 17లో యాక్షన్ బటన్ ఉంది. ఐఫోన్ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లోని ప్రైమరీ, సెకండరీ కెమెరాలు రెండూ 48MP కెమెరాతో వస్తాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 18MP సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది. కంపెనీ విషయానికొస్తే.. ఐఫోన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 11 గంటల నుంచి 12 గంటలు ఉంటుంది. వైర్‌లెస్, 40W వైర్డ్ ఛార్జింగ్ రెండూ సపోర్ట్ అందిస్తాయి.
