Smart TV Buying Guide : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఈ ఫీచర్ ఉంటేనే ఇంటికి తెచ్చుకోండి.. లేదంటే మీ డబ్బులు వృథా..!

Smart TV Buying Guide: స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు రిఫ్రెష్ రేట్‌ను పట్టించుకోరు. ఇది చాలా ముఖ్యమైన ఫీచర్. ఈ ఫీచర్ వ్యూ, గేమింగ్ ఎక్స్ పీరియన్స్ రెండింటినీ అందిస్తుంది.. పిక్చర్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది.

Smart TV Buying Guide

  • స్మార్ట్ టీవీ కొనేవారు ఈ మిస్టేక్ అసలు చేయొద్దు
  • అన్ని స్మార్ట్ టీవీల్లో హై రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉండదు
  • సినిమాలు, గేమింగ్ వ్యూ కోసం టీవీలో ఈ ఫీచర్ ఉండాల్సిందే

Smart TV Buying Guide : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోండి. చాలామంది ఈ ఫీచర్ విషయంలో పెద్దగా పట్టించుకోరు. మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనేముందు ఈ ఫీచర్‌ ఉందో లేదో చెక్ చేయండి. అదే.. రిఫ్రెష్ రేట్ ఫీచర్.. ప్రస్తుతం ఈ ఫీచర్ టీవీల్లో తప్పనిసరిగా ఉండాలి.

చాలా కంపెనీలు ఈ హై రిఫ్రెష్ రేట్ టీవీ కోసం ఎక్కువ డబ్బులు పెట్టాలి కూడా. ఈ ఫీచర్ మూవీలు చూడటం నుంచి గేమింగ్ వరకు అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

రిఫ్రెష్ రేట్ అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, రిఫ్రెష్ రేట్ అంటే.. ఒక స్క్రీన్ సెకనుకు కొత్త పిక్చర్ ఎన్నిసార్లు అప్‌డేట్ లేదా రిఫ్రెష్ చేస్తుందో తెలిపే సంఖ్య. దీనిని హెర్ట్జ్ (Hz) లో కొలుస్తారు. చాలా స్మార్ట్ టీవీలు 60 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. కొత్త టీవీని కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఈ రిఫ్రెష్ రేట్ ఉన్న మోడళ్లను తీసుకోవద్దు.

Read Also : WhatsApp Backup : పండగ చేస్కోండి.. గూగుల్ డ్రైవ్‌కు గుడ్‌బై? ఇక వాట్సాప్‌లోనే ‘చాట్ బ్యాకప్’ కొత్త ఫీచర్..!

హై రిఫ్రెష్ రేట్ బెనిఫిట్స్ ఏంటి? :
ఈ టెక్నికల్ ఫీచర్‌ గురించి చాలామందికి తెలియదు. హై రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీని వాడితే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. హై రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీ బెనిఫిట్ ఒకటి బ్లర్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా హై రిఫ్రెష్ రేట్ కంటిపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. తద్వారా ఎక్కువ సేపు టీవీ చూసినా పెద్దగా అలసటగా అనిపించదు.

మీరు క్రీడాభిమాని అయితే.. హై రిఫ్రెష్ రేట్ కారణంగా మీ మ్యాచ్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. మీ టీవీలో గేమింగ్ ఆడుతుంటే హై రిఫ్రెష్ రేట్ ఇన్‌పుట్ లాగ్‌ను తగ్గిస్తుంది. తద్వారా గేమ్‌లు మరింత ఫాస్ట్ రెస్పాండ్ అవుతాయి. అందుకే 120Hz, 144Hz, 165Hz లేదా అంతకంటే ఎక్కువ హై రిఫ్రెష్ రేట్ ఉన్న మోడల్‌ టీవీని ఎంచుకోండి.

స్మార్ట్ టీవీ కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి :

  • మీ స్మార్ట్ టీవీలో ఎక్కువ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలంటే ఎక్కువ ర్యామ్ మోడల్‌ ఎంచుకోండి.
  • టీవీని కొనేటప్పుడు మోడల్ ఇయర్ తప్పకుండా చెక్ చేయండి. మూడేళ్ల కన్నా పాత మోడల్‌ అసలు కొనద్దు.
  • టీవీ సౌండ్ అవుట్‌పుట్‌ తప్పకుండా చెక్ చేయండి. టీవీకి కనీసం 30W సౌండ్ అవుట్‌పుట్ ఉండాలి.
  • ఆడియో ఎక్స్ పీరియన్స్ కోసం టీవీతో పాటు సౌండ్‌బార్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.