Whatsapp Tips : చాట్‌లే కాదు.. వాట్సాప్ బ్యాకప్ కూడా రిస్కే.. ఈ చిన్న సెట్టింగ్ ఇప్పుడే ఆన్ చేయండి!
Whatsapp Tips : వాట్సాప్ చాట్ బ్యాకప్ డేటా లాక్ చేయాలంటే మీరు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలి. మీ బ్యాకప్ స్పెషల్ పాస్‌వర్డ్ లేదా 64-అంకెల సెక్యూరిటీ కీతో లాక్ అవుతుంది.
- Sreehari A
- Updated on- May 23, 2026 / 05:39 PM IST
Whatsapp Tips ( Image Credit : AI )
- చాట్‌లు సేఫ్ అనుకుంటున్నారా..? బ్యాకప్‌నే టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు
- ఈ చిన్న సెట్టింగ్ లేకపోతే వాట్సాప్ డేటా ఎవరైనా చూడొచ్చు
- వాట్సాప్‌లో 64-అంకెల సెక్యూరిటీ కీతో బ్యాకప్ లాక్
Whatsapp Tips : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్ చాట్స్, బ్యాకప్ భద్రమేనా? హ్యాకర్లు మీ చాట్స్ మాత్రమే కాదు.. మీ వాట్సాప్ బ్యాకప్ డేటాను కూడా ఈజీగా హ్యాక్ చేయగలరు. అందులో మీరు పంపించే మెసేజ్, ఫొటోలు, వీడియోలు, ఏదైనా పర్సనల్ డాక్యుమెంట్లు అన్నింటికి డేటా రిస్క్ ఉంటుంది.
అందుకే యూజర్ల ప్రొటెక్షన్ కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంటుంది. సాధారణంగా వాట్సాప్ చాట్‌లు డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని అందరికి తెలిసిందే. మీ చాట్స్ ఎవరూ దొంగచాటుగా వినలేరు. అయితే, చాట్ బ్యాకప్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను విడిగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుందని కొందరికే తెలిసి ఉంటుంది.
ఒకవేళ మీరు ఈ చిన్న సెట్టింగ్ ఆఫ్ చేస్తే.. మీ చాట్‌లు వాట్సాప్‌లో సేఫ్‌గా ఉండవచ్చు. కానీ, గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌కు బ్యాకప్ చేసినప్పుడు అంత సురక్షితంగా ఉండవు. తద్వారా బ్యాకప్ డేటాకు హ్యాకింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం చాలా ముఖ్యం.
64 అంకెల సెక్యూరిటీ లాక్ :
మీరు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయగానే మీ బ్యాకప్ ఒక స్పెషల్ పాస్‌వర్డ్ లేదా 64-అంకెల సెక్యూరిటీ కీతో లాక్ అవుతుంది. ఏ థర్డ్ పార్టీ టూల్ కూడా మీ డేటాను రీడ్ చేయలేవు. గూగుల్, ఆపిల్, లేదా మెటా కూడా మీ బ్యాకప్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయలేవు.
మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయినా ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసి ఉంటే బ్యాకప్ డేటా కేవలం కోడ్‌గా కనిపిస్తుంది. సరైన పాస్‌వర్డ్ లేకుండా అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యం. అందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఫీచర్ తప్పనిసరిగా ఎనేబుల్ చేయాలని సూచిస్తున్నారు.
ఇలా ఫీచర్ ఆన్ చేయండి :
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఐకాన్‌కు వెళ్లండి. అక్కడే చాట్స్ సెక్షన్‌కు వెళ్లి చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న టోగుల్‌ను ఆన్ చేయండి.
ఆ తర్వాత వాట్సాప్ మిమ్మల్ని కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయమని లేదా పాస్‌కీతో వెరిఫై చేయమని అడుగుతుంది. మీకు ఏది కావాలో అదే ఆప్షన్ ఎంచుకోవచ్చు. సెటప్ పూర్తయిన తర్వాత మీ చాట్ బ్యాకప్‌లు మునుపెన్నడూ లేనంత చాలా ప్రొటెక్ట్ అవుతాయి.
రెగ్యులర్ పాస్‌వర్డ్ కన్నా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉండాలి. ఈ రోజుల్లో పాస్‌కీ ఫీచర్ బాగా పాపులర్. పాస్‌కీని వాడటం ద్వారా బయోమెట్రిక్స్ లేదా డివైజ్ సెక్యూరిటీ ద్వారా మీ ఐడెంటిటీ వెరిఫై అవుతుంది. తద్వారా మరొకరు మీ బ్యాకప్‌ను యాక్సెస్ చేయడం చాలా కష్టం. మీరు ఇప్పటికే ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయకుంటే వెంటనే ఆన్ చేయండి. ఈ నార్మల్ సెట్టింగ్ భవిష్యత్తులో మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల చేతికి చిక్కకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
