iPhone 13 : ఆపిల్ ఈవెంట్లో ‘దమ్ మారో దమ్ సాంగ్’ వీడియో!
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాది ఈవెంట్లో కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆపిల్ సరికొత్త మోడళ్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను ప్రవేశపెట్టింది.
- Sreehari A
- Published on- September 15, 2021 / 01:21 PM IST
'dum Maaro Dum' At Apple Event! New Iphone 13 Ad
‘Dum Maaro Dum’ at Apple Event! New iPhone 13 Ad : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాది ఈవెంట్లో కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆపిల్ సరికొత్త మోడళ్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను ప్రవేశపెట్టింది. లాంచ్ చేసే ప్రోడక్స్ లో మాత్రమే కాదు.. లాంచ్ టేకింగ్ కూడా డిఫరెంట్ ప్రదర్శిస్తుంది. ఈ ఏడాది ఈవెంట్లో మాత్రం ఆపిల్ ట్విస్ట్ ఇచ్చింది ఐఫోన్ 13 ( iPhone 13 ) లాంచ్ వీడియోలో పాపులర్ బాలీవుడ్ సాంగ్ ‘దమ్ మారో దమ్’ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వాడేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Neeraj Chopra : 428 కోట్లకు చేరిన అథ్లెట్ నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువ
భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆపిల్ ఈ పాపులర్ వీడియోను ప్లే చేసినట్టుగా తెలుస్తోంది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల లాంచ్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.. ఇప్పుడంతా ఆ ఫోన్లలో వాడిన మ్యూజిక్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీ ఆపిల్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.
భారతదేశంలో ఆపిల్ ఈవెంట్ అయితే.. ఈ వీడియోను ప్లే చేసి ఉండొచ్చు.. కానీ, ఆపిల్ ఈవెంట్ క్యూపర్టినోలో జరిగింది. ఫోన్ను లాంచ్ చేసే సమయంలో సీఈవో టిమ్ కుక్ వస్తుండగా ఈ మ్యూజిక్ ప్లే బ్యాక్ అయింది. ఆర్టిస్ట్ ఫూట్సీ క్రియేట్ చేసిన ప్రమోషనల్ వీడియోలో ప్రారంభంలోనే ఈ మ్యూజిక్ వినొచ్చు. సరికొత్త ఫీచర్లతో లాంచ్ అయిన ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి భారత మార్కెట్లోకి రానుంది.
Priyamani: ప్రియా హాట్ ఫోజులకు మతి పోవాల్సిందే!
