నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇనిస్టాగ్రామ్
- Subhan Ali Shaik
- Published on- November 29, 2019 / 03:39 AM IST
ఫేస్‌బుక్, ఇనిస్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. ఫేస్ బుక్ లాగిన్ చేయబోతే ‘సారీ, ఏదో పొరబాటు జరిగింది. త్వరగా దానిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని వచ్చింది. ఇనిస్టాగ్రామ్ హోం పేజీపై ‘ఊప్స్, ఏదో ఎర్రర్ వచ్చింది’ అని డిస్ ప్లే కనిపించింది.
ఈ కాసేపటిలోనే సోషల్ మీడియా యూజర్లు మిగిలిన ట్విట్టర్ అకౌంట్లపై పడ్డారు. ఏం జరిగిందో అర్థంకాక, #ఫేస్‌బుక్‌డౌన్, #ఇనిస్టాగ్రామ్‌డౌన్ అనే హ్యాష్ ట్యాగులతో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో కొన్ని గంటలపాటు ట్రెండింగ్‌గా మారాయి.
