Best Budget 5G Phones : రూ.20 వేలలోపే బెస్ట్ 5G ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 4 ఫోన్లు మీ బడ్జెట్‌లోనే కొనేసుకోవచ్చు!
Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్‌లో శాంసంగ్, మివి, ఏఐ ప్లస్, ఇన్ఫినిక్స్ 5జీ ఫోన్లు రూ.20వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- October 11, 2026 / 04:56 PM IST
Best Budget 5G Phones
- శాంసంగ్ నుంచి ఇన్ఫినిక్స్ వరకు.. బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్లు
- కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ నాలుగు ఫోన్లపై ఓ లుక్కేయండి
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. తక్కువ ధరకే మొబైల్స్
Flipkart Big Billion Days 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సమయంలో మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్, ఏఐ+, మివి వివో వంటి పాపులర్ బ్రాండ్‌ల ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20వేల కన్నా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 7000mAh వరకు బ్యాటరీలు, 50MP డ్యూయల్ కెమెరాతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో లభిస్తున్నాయి. ఈ ఫోన్లలో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్ పూర్తి లిస్టును ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. 4GB ర్యామ్ అందించే ఈ ఫోన్‌పై అసలు ధరపై 26శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.850 ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.16,149కే కొనేసుకోవచ్చు.
Read Also : Mobile Recharge Prices : మొబైల్ యూజర్లకు మరో షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. ఈసారి ఎంతంటే?
మివి వన్ 5జీ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో 8GB ర్యామ్ మివి వన్ 5జీ ఫోన్ రూ.14,999కే లభిస్తోంది. అసలు ధరపై 42శాతం తగ్గింపుతో లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.750 ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.14,249 అవుతుంది.
Ai+ నోవా 2 పవర్ 5జీ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ 2026 సందర్భంగా Ai+ నోవా 2 పవర్ 5జీ ఫోన్ 39శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,800 ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ధర రూ.15,199కే లభిస్తోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 సందర్భంగా ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ ఫోన్ 36శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. అదనంగా, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 వరకు ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర రూ.14,749 అవుతుంది.
