Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఖతర్నాక్ ఆఫర్లు.. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే?

Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్‌ సమయంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ, నోట్ 60 ప్రో 5జీ, నోట్ ఎడ్జ్ 5జీ, స్మార్ట్ 20 ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

  • Published on- September 29, 2026 / 05:24 PM IST

Flipkart Big Billion Days Sale Infinix Deals

  • ఇన్ఫినిక్స్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ధర తగ్గింపు
  • ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనపు డిస్కౌంట్లు
  • బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే ఎర్లీ బర్డ్ డీల్స్

Flipkart Big Billion Days Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్‌ ప్రారంభం కానుంది. అయితే, మెయిన్ సేల్‌కు ముందే ఎర్లీ బర్డ్ డీల్స్‌ ప్రారంభమైంది.

ఈ సేల్ సమయంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ, నోట్ 60 ప్రో 5జీ, నోట్ ఎడ్జ్ 5జీ, స్మార్ట్ 20తో సహా కొన్ని సరసమైన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ (Flipkart Big Billion Days Sale) డీల్స్‌ను అందిస్తోంది. కొనుగోలుదారులు ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎర్లీ బర్డ్ డీల్స్ అందుబాటులో ఉండగా ఇన్ఫినిక్స్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ ఫోన్ రూ. 15,999 ధరకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 17,499కి లిస్ట్ అయింది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 875 తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి ఫ్లిప్‌కార్ట్ రూ. 15,950 వరకు ఎక్స్చేంజ్ వాల్యూను అందిస్తోంది.

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 5జీ ధర :
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 5జీ ఫోన్ ధర రూ. 31,999 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 35,999కి లిస్టు అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై బ్రాండ్ అదనంగా రూ. 1,800 తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ రూ. 31,750 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా లిస్టు అయింది. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ, ఎక్స్చేంజ్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : iPhone 16 Price Drop : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16పై ఏకంగా రూ. 20వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ ధర :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ-బర్డ్ ఆఫర్ సందర్భంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జీ ఫోన్ రూ. 29,999 నుంచి రూ. 23,999కే లభిస్తోంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,200 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 22,799కి తగ్గుతుంది. పాత ఫోన్‌ బట్టి ఫ్లిప్‌కార్ట్ రూ. 22,750 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్ అసలు ధర రూ. 19,999 ఉండగా ఎర్లీ-బర్డ్ ఆఫర్‌లో భాగంగా రూ. 11,749కే లభిస్తోంది. కానీ, ప్రస్తుతం రూ. 13,499కే లిస్టు అయింది. ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ. 1,388 తగ్గింపు పొందవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12,111 ధరకు పొందవచ్చు. అలాగే, కొనుగోలుదారులు తమ పాత హ్యాండ్‌సెట్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్‌ను బట్టి ఎక్స్చేంజ్ చేస్తే రూ. 11,800 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ బీబీడీ డీల్స్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇన్ఫినిక్స్ ఆఫర్లు ఎర్లీ బర్డ్ డీల్స్‌గా లభిస్తున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమీపిస్తున్న కొద్దీ ఈ ప్లాట్‌ఫామ్ మరిన్ని స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను రివీల్ చేయనుంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ, స్టాక్ లభ్యత వంటివి మారే అవకాశం ఉంది.