Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఐఫోన్ 17, ఐఫోన్ 15 మోడళ్లపై రూ. 20వేలు తగ్గింపు!
Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, ఐఫోన్ 15 మోడళ్లపై ఏకంగా రూ. 20వేలు తగ్గింపు పొందింది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Flipkart Big Billion Days Sale 2026
- ఐఫోన్ 15 రూ. 63,999 ధరకు లిస్ట్ అయింది
- ఐఫోన్ 17ను రూ. 79,999 ధరకు లభించనుంది
- ఐఫోన్ 17 ధర ఇటీవలే రూ. 99,900కు పెరిగింది
Flipkart Big Billion Days Sale 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 17, ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ సందర్భంగా మీ బడ్జెట్ ధరకే లభించనున్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 17, ఐఫోన్ 15 సేల్ ధర :
ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ పోస్టర్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 ఐఫోన్ 15 సేల్ ధరలు వెల్లడయ్యాయి. ఐఫోన్ 17 ధర రూ. 79,999 కాగా, ఐఫోన్ 15 ధర రూ. 63,999గా ఉంది. లక్ష విలువైన ఐఫోన్ 17 ధర రూ. 20వేలు తక్కువ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 17 రూ. 82,900 ధరకు లాంచ్ కాగా ధర ఇటీవల రూ. 99,900కు పెంచారు. ప్రారంభ ధర నుంచి రూ.17వేలు పెరిగింది.
బ్యాంకు ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఐఫోన్ 17ను రూ. 84,999కు కొనేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు, రూ.3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తుంది. ధర రూ. 79,999కి తగ్గుతుంది.
Read Also : PM Kisan 24th Installment : రైతులకు కేంద్రం తీపికబురు.. దసరాకు ముందే ఖాతాల్లోకి పీఎం కిసాన్ రూ. 2వేలు..
ఐఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ధర రూ. 67,999కు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 తగ్గింపు, రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తుంది. ఫైనల్ ధర రూ. 63,999కు కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం iOS 26తో వస్తుంది. ఐఫోన్ 17లోని కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
