Flipkart Big Diwali Sale end : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ప్రీమియం గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్.. ఇదే లాస్ట్ ఛాన్స్ భయ్యా..!

Flipkart Big Diwali Sale end : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రీమియం గేమింగ్ స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్ అందిస్తోంది.

Top deals on premium gaming smartphones

Flipkart Big Diwali Sale end : దీపావళి వచ్చేసింది.. పండుగ అనగానే ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయా? అని చూస్తుంటారు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అనేక టాప్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌సెట్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంకుల నుంచి అదనపు డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు పూర్తి రిటైల్ ధరను కవర్ చేయనవసరం లేదు.

సేల్ సమయంలో గణనీయమైన తగ్గింపులను పొందవచ్చు. అద్భుతమైన ప్రాసెసర్, డిస్‌ప్లేతో కూడిన ప్రీమియం గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడే త్వరపడండి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2023కి ఈరోజు (నవంబర్ 11) చివరి రోజు. అందుకే, మీకోసం బెస్ట్ గేమింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

వన్‌ప్లస్ 11 5జీ :

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ (16జీబీ ర్యామ్+256జీబీ ఆర్ఓఎమ్) ధర రూ. 58,700 వద్ద ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా వైడ్ ఫీల్డ్‌ను అందిస్తోంది. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందించే 32ఎంపీ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. అదనంగా, ఈఐఎస్ సపోర్టును కలిగిన 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Read Also : Happy Diwali 2023 Wishes : వాట్సాప్‌లో దీపావళి కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేసి ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!

ఈ డివైజ్ పీఆర్ఓ, పీఏఎన్ఓ, నైట్‌తో సహా అనేక రకాల కెమెరా మోడ్‌లను అందిస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్టెడ్ 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ అమోల్డ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ప్రాసెసర్ కూడా కలిగి ఉంది. ఈ డివైజ్ బలమైన 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Top deals on premium gaming smartphones

ఆపిల్ ఐఫోన్ 15 ప్రో (128జీబీ) :
టైటానియం బిల్డ్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ బలమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ ప్రోమోషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గ్రాఫిక్స్ పర్పార్మెన్స్ మెరుగుపరుస్తుంది. ఏ17 ప్రో చిప్ ఆధారితంగా పనిచేస్తుంది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ ప్రో కెమెరా సిస్టమ్ హై రిజల్యూషన్ ఫొటోలకు 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా 7 లెన్స్‌లను కలిగి ఉంది. యూజర్ అనుభవం కోసం కస్టమైజడ్ బటన్ కూడా ఉంది. ఈ ఐఫోన్ ధర రూ.1,34,900 ఉండగా, అధునాతన ఫీచర్ల ప్రీమియం ప్యాకేజీని అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ :

ఈ హై-ఎండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ప్రో-గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. నైట్‌గ్రఫీ ద్వారా తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ ఫోన్ (12జీబీ ర్యామ్, 256జీబీ ఆర్ఓఎమ్), వైడ్ యాంగిల్ కెమెరా ఆకట్టుకునే 200ఎంపీ రిజల్యూషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆధారితమైన ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్‌తో మృదువైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గరిష్ట రిటైల్ ధర రూ.99999తో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అధునాతన కెమెరా సామర్థ్యాలను, మెరుగైన యూజర్ అనుభవంతో పవర్‌ఫుల్ ప్రాసెసింగ్‌ను అందిస్తుంది.

premium gaming smartphones

ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (128జీబీ) :
ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ 4కె డాల్బీ విజన్ సినిమాటిక్ మోడ్‌కు సపోర్టు ఇచ్చే 48ఎంపీ ప్రధాన కెమెరాతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే వీడియో సామర్థ్యాలను అందిస్తుంది. యాక్షన్ మోడ్ మృదువైన స్టేబుల్ హ్యాండ్‌హెల్డ్ వీడియోలను అందిస్తుంది. రోజంతా బ్యాటరీ లైఫ్, 29 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌తో అందిస్తుంది. గరిష్ట రిటైల్ ధర రూ.127999 ఉంటుంది. ఈ డివైజ్ మెరుగైన యూజర్ అనుభవం కోసం అధునాతన కెమెరా ఫీచర్లు, సుదీర్ఘ బ్యాటరీ పర్పార్మెన్స్ అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో (128జీబీ) :
ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో టెన్సర్ జీ3 SoCతో వచ్చింది. 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేతో విజువల్స్‌ను అందిస్తుంది. అయితే, 50ఎంపీ+48ఎంపీ+48ఎంపీ కెమెరా సెటప్ హై-క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఈ డివైజ్ 5050ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. గరిష్ట రిటైల్ ధర రూ. 1,06,999కు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరు, వివిడ్ డిస్‌ప్లే, అధునాతన కెమెరా సామర్థ్యాలు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read Also : Galaxy Smartphones : గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లలో ఓటీపీ మెసేజ్‌లను ఆటో డిలీట్ చేయొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!