Flipkart Goat Sale : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్లపై దిమ్మతిరిగే డీల్స్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..!
Flipkart Goat Sale : కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. జూలై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వరకు ఏదైనా తక్కువే..
- Sreehari A
- Published on- June 29, 2026 / 04:56 PM IST
Flipkart Goat Sale
- ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ జూలై 4న ప్రారంభం, ఐఫోన్‌పై అడ్వాన్స్ డీల్స్ రివీల్
- ధరల పెంపునకు ముందే ఐఫోన్ 17 సిరీస్ ధర రూ. 70,990 నుంచి ప్రారంభం
- ఐఫోన్ 15 నుంచి ఐఫోన్ 17 ప్రో మాక్స్ వరకు అన్ని మోడళ్లపై బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు
Flipkart Goat Sale : ఆపిల్ ఐఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన సేల్ రాబోతుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. జూలై 4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈసారి, ఆపిల్ ఐఫోన్ లైనప్‌కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లేటెస్ట్ ల్యాండింగ్ పేజీలో ప్రస్తుత ఐఫోన్ లైనప్ ధరల వివరాలు ఉన్నాయి.
సేల్ ప్రారంభం కాకముందే కొనుగోలుదారులు ఐఫోన్ల ఆఫర్లకు సంబంధించి (Flipkart Goat Sale) వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఐఫోన్లలో ఎక్కువ పాపులర్ లేటెస్ట్ ఐఫోన్ 17, ఐఫోన్ 16 మోడల్స్ కూడా తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. ఇందులో మీ ఫేవరెట్ ఐఫోన్ ఉంటే ఇలా డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17 సిరీస్ ఇప్పుడే కొనేసుకోండి :
ఈ సేల్‌లో ఐఫోన్ 17 సిరీస్ స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే.. బేస్ మోడల్ ఐఫోన్ 17 రూ. 70,990 ప్రారంభ ధరతో లభిస్తుందని అంచనా. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు వరుసగా సుమారు రూ. 1,12,900, రూ. 1,27,900గా ఉంటాయని అంచనా. అంతేకాదు.. ఈ లైనప్‌లో మరో రెండు ఐఫోన్‌లు కూడా అమ్మకానికి రానున్నాయి. ఇందులో చౌకైన ఐఫోన్ 17e ధర సుమారు రూ. 60,900, ఐఫోన్ ఎయిర్ ధర రూ. 95,900గా ఉంటుందని అంచనా.
ఇటీవలే ఆపిల్ ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు, మ్యాక్‌బుక్‌లతో సహా తమ అనేక ఫోన్ల ధరలను పెంచింది. రాబోయే రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ధరలను కూడా పెంచవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. అంటే, ధరల పెంపుకు ముందే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 ద్వారా మీకు నచ్చిన ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు.. ఐఫోన్ 17 కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. తద్వారా ఐఫోన్ 17 ధర మరింత తగ్గుతుంది.
పాత ఐఫోన్లపై సేల్ :
ఈ సేల్‌లో కొన్ని పాత ఐఫోన్ మోడళ్లు కూడా లభ్యం కానున్నాయి. ఇందులో పాపులర్ ఐఫోన్ 16 కూడా ఉంది. ఈ ఐఫోన్ ధర సుమారు రూ. 59,900గా ఉంది. అదే సమయంలో, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 73,900గా ఉంది. ఐఫోన్ 16e ధర సుమారు రూ. 55,900గా ఉండగా, ఐఫోన్ 15 సుమారు రూ. 49,900కు లభ్యం కానుంది.
