Flipkart GOAT Sale : భలే ఉంది భయ్యా ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ. 27000 డిస్కౌంట్.. డోంట్ మిస్!
Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీ ఫోన్ ధర రూ. 27వేలు తగ్గింది. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..
- Sreehari A
- Published on- July 5, 2026 / 02:23 PM IST
Flipkart GOAT Sale
- 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే
- 50MP మెయిన్ కెమెరా, 4,000mAh బ్యాటరీ సెటప్
- ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 40,800కే కొనేసుకోవచ్చు
Flipkart GOAT Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై డీల్స్, డిస్కౌంట్లు, ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఆఫర్లు, డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ (12GB+256GB స్టోరేజ్ వేరియంట్) ఈ-కామర్స్ సైట్‌లో రూ. 56,999 ధరకు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 3,325 తగ్గింపు పొందవచ్చు, ఆ తర్వాత అసలు ధర రూ. 53,674 తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత లేదా శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 40,800 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి (Flipkart GOAT Sale) ఉంటుందని గమనించాలి. గత ఏడాది జనవరిలో రూ. 80,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్‌పై ఇప్పుడు సుమారు రూ. 27,325 తగ్గింపు లభిస్తోంది.
Read Also : Vivo X200T Price : వివో లవర్స్‌కు పండగే.. ఈ వివో X200T ఫోన్ చాలా చీప్ మావా.. ధర జస్ట్ ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 6.2-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,000mAh బ్యాటరీ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 146.9 మిమీ పొడవు, 70.5 మిమీ వెడల్పు, 7.2 మిమీ మందం, 162 గ్రాముల బరువు ఉంటుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 10MP అల్ట్రావైడ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, యూఎస్‌బీ టైప్-సీ 3.2 పోర్ట్ ఉన్నాయి.
