Flipkart June Epic Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ సేల్.. రూ.15వేల నుంచి రూ. 50వేల రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. మీ డ్రీమ్ ఫోన్ ఇదేనా?
Flipkart June Epic Sale : ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ 2026 సందర్భంగా రూ. 15వేల నుంచి రూ. 50వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేససుకోవచ్చు.
- Sreehari A
- Published on- June 12, 2026 / 02:45 PM IST
Flipkart June Epic Sale ( Image Credit : AI )
- ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్లు ఇవే
- టాప్ డీల్స్‌లో పోకో F7, గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్లు కూడా
- అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, 80శాతం వరకు తగ్గింపు
Flipkart June Epic Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.
అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ కార్డ్‌ల ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో రూ. 15వేల నుంచి రూ. 50వేల (Flipkart June Epic Sale) ధరల రేంజ్ 5 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.. మీకు నచ్చిన ఫోన్ ఇంటికి తెచ్చుకోండి.
పోకో M7 ప్లస్ ధర రూ. 14,499 :
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే.. సుమారు రూ. 15వేల ధరలో పోకో M7 ప్లస్ తీసుకోవచ్చు. ప్రస్తుతం బడ్జెట్ ఫోన్లలో ఇదే బెస్ట్ వన్. 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 7,000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఈ ధర రేంజ్‌లో పోకో ఎం7 ప్లస్ ఫోన్ కొనేసుకోవచ్చు.
రియల్‌మి జీటీ 7టీ ధర రూ. 26,999:
రూ. 30వేల లోపు ధరలో రియల్‌మి నుంచి జీటీ 7టీ ఫోన్ బెస్ట్ ఆప్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 120Hz వద్ద 6.8-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది. రూ. 26,999 ధర వద్ద మిడ్-రేంజ్ కేటగిరీలో బెస్ట్ ఆల్-రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ పెర్ఫార్మెన్స్ చిప్ ఆప్షన్లతో వస్తుంది.
మోటో ఎడ్జ్ 60 ప్రో ధర రూ. 27,999 :
రూ. 30వేల ధరలో మోటోరోలా నుంచి మరో అద్భుతమైన ఫోన్. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 6.7-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP రియర్ కెమెరాతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. మోటోరోలా క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
పోకో F7 ఫోన్ ధర రూ. 32,999 :
ఈ లిస్టులో పోకో ఫోన్ ఆల్-రౌండర్. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర కేవలం రూ. 32,999 కాగా, 7,550mAh బ్యాటరీ 120Hz, అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీ ఫోన్‌లో గేమింగ్ ఆడినా ఎలాంటి ల్యాగ్ ఉండదు.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర రూ. 46,999 :
ప్రీమియం రేంజ్ ఫోన్ కొనేవారికి శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ బెటర్. ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 6.7-అంగుళాల 120Hz డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 4,900mAh బ్యాటరీతో వస్తుంది. 7 ఏళ్ల OS సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వస్తుంది. రూ. 50వేల లోపు ధరలో అద్భుతమైన ఫోన్ అని చెప్పవచ్చు.
