IFA 2026 Unusual Tech : ఇదో టెక్ మాయ.. ఒక్కో గాడ్జెట్ ఓ వింతే! IFA 2026లో మతిపొగొట్టే ఈ గాడ్జెట్లు ఎందుకు స్పెషల్?

IFA 2026 Unusual Tech : IFA 2026లో అసాధారణ టెక్ గాడ్జెట్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 17-అంగుళాలుగా మారే లెనోవో ప్రాజెక్ట్ స్వాన్ నుంచి డిటాచబుల్ Hohem కెమెరా, డైసన్ కెమెరా జెట్, బెల్కిన్ మ్యాగ్ సేఫ్ స్టాండ్, అంకెర్ 100W యూనివర్సల్ చార్జర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

  • Published on- September 11, 2026 / 02:25 PM IST

IFA 2026 Unusual Techs

  • 17 అంగుళాల ల్యాప్‌టాప్ నుంచి కెమెరా టూత్‌బ్రష్ వరకు..
  • ల్యాప్‌టాప్ స్క్రీన్ పెరుగుతుంది.. కెమెరా విడిపోతుంది
  • గింబల్ హ్యాండిల్ ఒకచోట.. కెమెరా మరోచోట
  • టూత్‌బ్రష్‌లో కెమెరా AI ప్లస్ వాటర్ ఫ్లాసర్

IFA 2026 Unusual Tech : ఇదో టెక్ మాయ.. చూసేందుకు నార్మల్ టెక్ గాడ్జెట్లలా ఉన్నా వీటి స్పెషాలింటో అంతాఇంతా కాదు.. చాలా వింతైన గాడ్జెట్లు.. ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ప్రస్తుతం బెర్లిన్‌లో జరుగుతున్న IFA 2026 ఈవెంట్ ప్రదర్శనలో వింత గాడ్జెట్లు సందడి చేస్తున్నాయి.

అందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏఐ డివైజ్‌లతో పాటు రోజువారీ జీవితంలో వాడే సాధారణ వస్తువులకు సరికొత్త రూపాన్ని (IFA 2026 Unusual Tech) ఇచ్చేలా ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని డివైజ్‌లు సైజును మార్చుకుంటే.. మరికొన్ని అవసరమైనప్పుడు విడిపోయేలా ఉన్నాయి. ఇంకొన్ని సాధారణ టూత్‌బ్రష్, ఫోన్ స్టాండ్, చార్జర్‌లకే స్మార్ట్ ఫీచర్లతో సరికొత్తగా కనిపిస్తున్నాయి. అలాంటి ప్రత్యేకమైన టెక్ గాడ్జెట్లలో కొన్ని ముఖ్యమైన గాడ్జెట్లు మీకోసం..

1. లెనోవో ప్రాజెక్ట్ స్వాన్ :
సాధారణంగా బిగ్ స్క్రీన్ కావాలంటే పెద్ద ల్యాప్‌టాప్ తీసుకెళ్లాలి. లెనోవో ప్రాజెక్ట్ స్వాన్ మీ చేతిలో ఉంటే పెద్ద ల్యాప్ టాప్ తో పనిలేదు. చూసేందుకు కాంపాక్ట్ 14-అంగుళాల ల్యాప్‌టాప్‌లా కనిపిస్తుంది. కానీ, అవసరమైనప్పుడు OLED డిస్‌ప్లే మరింత పెద్దదిగా మారుతుంది.

IFA 2026 Unusual Tech Lenovo Project Swan

17 అంగుళాల స్క్రీన్‌గా మారిపోతుంది. చిన్న ల్యాప్‌టాప్‌లో బిగ్ మానిటర్ లాంటి వర్క్‌స్పేస్ అందిస్తుంది. ప్రయాణాల్లో ప్రత్యేకమైన పోర్టబుల్ మానిటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ డివైజ్‌ మాత్రమే.. నిజంగా మార్కెట్లోకి రాలేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న బ్యాగ్‌లో బిగ్ స్క్రీన్ అనొచ్చు.

2. హోహెమ్ ఐపిక్ : కెమెరానే విడదీసి ఎక్కడికైనా.. :
కెమెరా, గింబల్ రెండూ మిక్స్ ఉండే (Hohem Eyepic) మరో అట్రాక్టివ్ డివైజ్. ఇందులో 4K/60fps వాటర్‌ప్రూఫ్ కెమెరా ఉంది. ఇది మాడ్యూల్‌ హ్యాండిల్ నుంచి రిమూవ్ చేయొచ్చు. లాన్యార్డ్‌కు తగిలించుకోవచ్చు లేదంటే మెటల్ సర్పేస్ పై మాగ్నెటిక్‌గా అమర్చవచ్చు.

IFA 2026 Unusual Tech Hohem EyePic

మరో స్పెషాలిటీ ఏమిటంటే.. హ్యాండిల్‌లోని స్క్రీన్ ద్వారా కెమెరాను దూరం నుంచి కంట్రోల్ చేయొచ్చు. సుమారు 30 అడుగుల దూరం వరకు ప్రివ్యూ చూడొచ్చు. గింబల్ హ్యాండిల్ ఒకచోట ఉంటే కెమెరా మరోచోట ఉంటుంది.

3. డైస్ కెమెరాజెట్ : టూత్‌బ్రష్‌లో కెమెరా.. ఏఐతో వాటర్ ఫ్లాసింగ్ :
టూత్‌బ్రష్‌లో హైటెక్ కూడా ఉంటుందా? కానీ, డైసన్ కెమెరాజెట్ అదే చేసింది. ఇది ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ మాత్రమే కాదు. ఇందులో కెమెరా ఆధారిత టెక్నాలజీ ఉంటుంది. నోటిలోని ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట టార్గెటెడ్ వాటర్-ఫ్లాసింగ్ జెట్ వాడటమే దీని స్పెషాలిటీ.. అంటే ఒకేసారి బ్రషింగ్‌తో పాటు వాటర్ ఫ్లాసింగ్‌ చేయడమే కాన్సెప్ట్. IFAలో ఈ డివైజ్ డెమోగా చూపించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. టూత్‌బ్రష్‌లో కెమెరాతో ఏఐ ప్లస్ వాటర్ ఫ్లాసర్ అనమాట..

IFA 2026 Unusual Tech Hohem EyePic

4. లెనోవో ఐడియాప్యాడ్ వైబ్.. :
అన్ని వింత టెక్‌లు ఖరీదైన కాన్సెప్ట్‌లే కావు. లెనోవో ఐడియాప్యాడ్ వైబ్ అనేది సుమారు 700 డాలర్ల ధరలో వస్తుంది. ఎక్కువ ఫీచర్లు అందించే అద్భుతమైన ల్యాప్‌టాప్‌గా నిలిచింది. స్నాప్ డ్రాగన్ ఎక్స్ లేదా రైజెన్ ఏఐ 400 ప్రాసెసర్ ఆప్షన్లతో పాటు 4 USB పోర్టులు, microSD కార్డ్ రీడర్, HDMI వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మీ బడ్జెట్‌లోనే ఫుల్ కనెక్టివిటీ అందించే ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు.

IFA 2026 Unusual Tech Hohem EyePic

5. బెల్కిన్ కంపాక్ట్ మాగ్నిటిక్ రింగ్ స్టాండ్ :
ఈ స్టాండ్ మీ దగ్గర ఉంటే మీ ఫోన్‌ను గోడపైనే పెట్టేయొచ్చు. ఫోన్ స్టాండ్ అంటే సాధారణంగా టేబుల్‌పై పెట్టుకునేలా ఉంటుంది. అదే బెల్కిన్ కంప్టాక్ మాగ్నిటిక్ రింగ్ స్టాండ్ కొంచెం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది మ్యాగ్ సేఫ్ కంపాటబుల్ మాగ్నిటిక్ మౌంట్, సక్షన్ మౌంట్, అడ్జస్టబుల్ హింగ్స్ ఉన్నాయి.

Read Also : Apple 17 Pro Series : ఆపిల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. కొత్త ఐఫోన్ 18 సిరీస్ ఎంట్రీ.. ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ ఔట్..!

మాగ్నిటిక్ రింగ్ ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. మిర్రర్, గాజు, మెటల్ వంటి స్మూత్ సర్ఫేస్ పై కూడా ఐఫోన్ వంటివి వివిధ యాంగిల్స్‌లో సెట్ చేసుకోవచ్చు. అలాగే, వీడియో కాల్స్, వీడియో షూటింగ్ లేదా కంటెంట్ చూసేవారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని ఉపరితలాలపై సక్షన్ ఒకే విధంగా పనిచేయదు. టేబుల్ లేకపోయినా ఫోన్‌కు స్టాండ్ మాదిరిగా పనిచేస్తుంది.

6. యాంకెర్ నానో యూనివర్సల్ ఛార్జర్ :
మీరు విదేశాలకు ప్రయాణించే సమయంలో ఈ ఒక్క చార్జర్ మూడు దేశాల ప్లగ్స్ సపోర్టు చేస్తుంది. ప్రయాణాల్లో యూఎస్ ప్లగ్ వేరేలా ఉంటుంది. యూకే ప్లగ్, ఈయూ ప్లగ్ వేర్వుగా ఉంటాయి. ఈ సమస్యకు యాంకెర్ నానో యూనివర్సల్ ఛార్జర్ అద్భుతంగా ఉంటుంది.

IFA 2026 Unusual Tech Hohem EyePic

ఇందులో US, UK, EU ప్లగ్స్‌నే బిల్ట్-ఇన్‌గా ఇచ్చారు. ఒకేసారి 4 డివైజ్‌ల వరకు చార్జ్ చేయవచ్చు. ఒక్క డివైజ్‌కు గరిష్ఠంగా 100W పవర్ అందించగలదు. USB-C, USB-A పోర్టులతో ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్లను ఒకే యూనిట్‌తో చార్జ్ చేసుకోవచ్చు. మీ ట్రావెల్ బ్యాగ్‌లో 3 చార్జర్లు కాదు ఒక్కటి చాలు..

మొత్తంగా చూస్తే.. IFA 2026లో కనిపించిన ఈ వింత గాడ్జెట్లలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. రోజూ మనం వాడే టెక్‌ను మరింత చిన్నదిగా, స్మార్ట్‌గా, మల్టీ-ఫంక్షనల్‌గా మార్చుకోవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను అవసరమైనప్పుడు పెంచుకోవచ్చు. కెమెరాను విడిగా వాడుకోవచ్చు. టూత్‌బ్రష్‌కు కెమెరా పెట్టొచ్చు. ఫోన్ స్టాండ్‌ను గోడ/గాజుపై అమర్చుకోవచ్చు. ఒక్క చార్జర్‌తో వివిధ దేశాల ప్లగ్‌లకు వాడుకోవచ్చు.. ఒకదానితో బోలెడు ఉపయోగాలు అనమాట..