Gemini App : వావ్.. జెమిని యూజర్లకు పండగే.. ఇక AIతో వీడియోలను ఈజీగా మార్చేయొచ్చు.. ఎడిటింగ్ స్కిల్స్ అక్కర్లేదు..!

Gemini App : గూగుల్ జెమిని ఓమ్నితో మీకు నచ్చిన వీడియో ఎడిటింగ్ ఈజీగా ఎడిట్ చేయొచ్చు. ఈ కొత్త ఏఐ-ఆధారిత ఫీచర్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసి సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు.

Gemini App users

  • జెమిని యాప్ యూజర్లు ఇకపై వీడియోలలో మార్పులు చేయొచ్చు
  • జెమిని ఓమ్నితో నచ్చిన వీడియో ఎడిటింగ్ చేయొచ్చు
  • టెక్స్ట్, ఫొటోలు, ఆడియోలే కాదు.. వీడియోలు కూడా మార్చొచ్చు

Gemini App : ఏఐతో వీడియోలు ఎడిట్ చేయొచ్చు తెలుసా? ఇటీవలే గూగుల్ జెమిని ఓమ్ని వీడియో ఎడిటింగ్ ఫీచర్‌ను భారతీయ యూజర్ల కోసం లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా జెమిని యాప్‌లోనే లేదా వెబ్‌లో వీడియోలను ఎడిట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎడిటింగ్ టూల్స్‌తో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. జస్ట్ ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎలా వీడియో ఎడిట్ చేయాలో ఏఐకి చెబితే సరిపోతుంది.

గూగుల్ I/O 2026 ఈవెంట్‌లో వీడియో కంటెంట్ క్రియేషన్‌ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. మీరు ఇచ్చే ఇన్‌పుట్ టైమ్ విషయంలో జెమిని ఓమ్ని టెక్స్ట్, ఫొటోలు, ఆడియో, వీడియోలను ఈజీగా ఎడిట్ చేయగలదు. చాట్‌బాట్‌కు కచ్చితమైన కమాండ్స్ ఇవ్వాలి. మీ మార్పును సింపుల్ లాంగ్వేజీలో వివరించడమే. మిగతాదంతా ఏఐ చూసుకుంటుంది.

జెమిని ఓమ్ని ద్వారా వీడియోలను ఎలా ఎడిట్ చేయాలి? :

  • వీడియోను ఎడిట్ చేయడం చాలా ఈజీ
  • 1. మీరు ఏదైనా ఒక వీడియోను అప్‌లోడ్ చేయండి.
  • 2. మీకు కావలసిన మార్పును కచ్చితంగా టైప్ చేయండి.
  • 3. జెమిని వీడియోను ప్రాసెస్ చేసి దానికి అనుగుణంగా ఎడిట్ చేసిపెడుతుంది.
  • 4. మీరు రిజల్ట్ ప్రివ్యూ చేయగలదు. మీకు నచ్చితే వీడియోను సేవ్ చేయొచ్చు.

మీరు ఇవన్నీ మీ ఫోన్‌లోని జెమిని యాప్ ద్వారా లేదా నేరుగా బ్రౌజర్ నుంచి చేయవచ్చు. జెమిని ఓమ్నితో మరెన్నో అద్భుతాలు చేయొచ్చు. చిన్న మార్పులే కాదు.. వీడియోలో కొత్త అంశాలను కూడా యాడ్ చేయగలదు. ఈ సిస్టమ్ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది సీన్ ఆధారంగా జనరేట్ చేస్తుంది. రోల్స్, సెట్టింగ్‌ మార్చకుండా అవసరమైన అంశాలనే మార్చగలదు.

మీకు ఎలా కావాలో జెమినీని అడిగేయండి :
ఒక వస్తువు లేదా కొత్త అక్షరాన్ని యాడ్ చేయాలా? అయితే, ఇక టైప్ చేయాల్సిన పనిలేదు. జెమిని ఈ పని (Gemini App) చూసుకుంటుంది. మీ వీడియోను ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు వీడియోలో మార్పులు చేసినా మోడల్ మీ పాత ప్రాంప్ట్స్ గుర్తుంచుకుంటుంది.

Read Also : Portronics Mini UPS : కొత్త పోర్ట్రానిక్స్ రౌటర్ యూపీఎస్‌ వచ్చేసింది.. ఇక పవర్ పోయినా Wi-Fi వర్క్ చేస్తుంది.. ధర ఎంతో తెలుసా?

రియల్ వరల్డ్ క్రియేటివిటీ కోసం గూగుల్ జెమిని ఓమ్నిని తీసుకొచ్చింది. మీరు చేసే మార్పులు నిజంగా చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. రియల్ టైమ్ మీరు ఊహించినట్లే రోల్స్ ప్లే అవుతాయి. వస్తువులు కిందపడతాయి. నీళ్లు ప్రవహిస్తాయి. అంతేకాదు.. స్టోరీ చెప్పడం, సైన్స్, కల్చర్ వంటి జెమినికి ఉన్న పరిజ్ఞానంపై ఆధారపడి పనిచేస్తుంది ఇందులోని కంటెంట్ కేవలం చూసేందుకు క్లియర్ మాత్రమే కాదు.. సందర్భానికి తగినట్లుగా కూడా జనరేట్ చేస్తుంది.

ఇక కేవలం వీడియోలకే పరిమితం కాదు.. ఫొటోలు, స్కెచ్‌లు, రిఫరెన్స్ ఫొటోలు లేదా వాయిస్ మోడల్స్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. జెమిని కొత్త కంటెంట్‌ను జనరేట్ చేసేందుకు సోర్స్ తీసుకుంటుంది. గూగుల్ డిజిటల్ అవతార్లకు కూడా సపోర్టు అందిస్తుంది.

మీ వాయిస్, లుక్ ద్వారా మీ వీడియో ఎలా ఉండాలో క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి, వాయిస్ కోసం ఆడియో రిఫరెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, పూర్తిస్థాయి వాయిస్ జనరేషన్ ఫీచర్లు త్వరలో రానున్నాయి.

ట్రాన్సపరెన్సీ, సేఫ్టీ :
జెమిని ఓమ్నితో రూపొందించిన ప్రతి వీడియో, గూగుల్ కనిపించని వాటర్‌మార్క్ సింథ్‌ఐడీతో వస్తుంది. వీడియో ఏఐ ద్వారా జనరేట్ అయిందో లేదో ఈజీగా వెరిఫై చేయొచ్చు. ఈ వెరిఫైడ్ టూల్స్ కేవలం జెమిని యాప్‌లోనే కాదు.. క్రోమ్, గూగుల్ సెర్చ్‌లో కూడా చూడొచ్చు.