విద్యార్థులకు ఈ మూడు 5G స్మార్ట్‌ఫోన్‌లు చాలా బెస్ట్‌.. వీటిపై ఆఫర్‌లు ఉన్నాయి.. ఫీచర్లు అదరహో..

విద్యార్థులు దీన్ని చాలా ఇష్టపడతారు.

విద్యార్థులకు ఈ మూడు 5G స్మార్ట్‌ఫోన్‌లు చాలా బెస్ట్‌.. వీటిపై ఆఫర్‌లు ఉన్నాయి.. ఫీచర్లు అదరహో..

Updated On : May 11, 2025 / 9:18 PM IST

విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లను సరిగ్గా వాడుకుంటే వారికి ఎంతో లాభం. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ తరగతుల ద్వారా బోధిస్తున్నాయి. అలాగే, విద్యార్థులు ప్రాజెక్టులు, హోంవర్క్‌ కోసం ఎన్నో వెబ్‌సైట్స్‌ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

ఎన్నో ఎడ్యుకేషనల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మొబైళ్లను చదువు కోసమే ఉపయోగిస్తూ.. గేమ్స్‌, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా ఉంటే భవిష్యత్తులో గొప్పస్థాయికి ఎదగవచ్చు. విద్యార్థులకు అనువుగా ఉండే 5G స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని ఉన్నాయి.

తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కావాలి ప్లాన్ చేస్తుంటే శాంసంగ్ గెలాక్సీ M16, రియల్‌మీ నార్జో 80x 5G, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4 Lite 5Gలో ఏదైనా ఒకటి కొనుక్కోవచ్చు. ఆన్‌లైన్ తరగతులు, ఎడ్యుకేషనల్ యాప్స్‌ను సౌకర్యంగా వాడుకోవడం వంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి. వీటిపై ప్రస్తుతం ఆఫర్లు ఉన్నాయి.

Also Read: ఐపీఎల్‌ వాయిదా పడడం వల్ల ఎన్ని వందల కోట్ల నష్టం వస్తుందో తెలుసా?

శాంసంగ్ గెలాక్సీ M16
శాంసంగ్ గెలాక్సీ M16 స్మార్ట్‌ఫోన్‌తో వేగంగా 5G కనెక్టివిటీ అందుకోవచ్చు. విద్యార్థులు దీన్ని చాలా ఇష్టపడతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. స్మూత్‌గా, లాగ్-ఫ్రీ పర్ఫార్మన్స్‌తో ఉంటుంది. దీని AMOLED డిస్ప్లే చాలా బాగుందటుంది. దీన్ని ఇప్పుడు అమెజాన్‌లో రూ.11,499 కు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ నార్జో 80x 5G
మంచి పర్ఫార్మన్స్‌ ఉండే స్మార్ట్‌ఫోన్ కావాలని మీరు అనుకుంటుంటే రియల్‌మీ నార్జో 80x 5G మంచి ఆప్షన్. ఇది 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120 Hz. ఇది ఆకర్షణీయమైన స్లిమ్ డిజైన్‌తో 50MP AI కెమెరా సెటప్‌లో వచ్చింది. దీని ధర మీకు రూ.13,998.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4 Lite 5G
అద్భుతమైన ఫీచర్లతో OnePlus నుంచి వచ్చిన ప్రీమియం-లుకింగ్ ఫోన్ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4 Lite 5G. 5G నెట్‌వర్క్, 8GB RAM, 128GB స్టోరేజ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. ఇది స్లిమ్ డిజైన్‌తో ఉన్నప్పటికీ, అధిక పర్ఫార్మన్స్‌ ఉంటుంది. దీన్ని అమెజాన్‌లో రూ.17,999 కు కొనుగోలు చేయవచ్చు.