Gmail Whatsapp Feature : వావ్.. వండర్ఫుల్.. జీమెయిల్‌లోనూ వాట్సాప్ ఫీచర్.. ఇక మీ మెయిల్స్‌కు ఫుల్ ప్రొటెక్షన్!
Gmail Whatsapp Feature : జీమెయిల్ వాడే ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీతో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ సెక్యూర్ సర్వీసు వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరిగా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అందిస్తుంది. పూర్తి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
Gmail Whatsapp Feature
- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం జీమెయిల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- వాట్సాప్, టెలిగ్రామ్ మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్
- మీరు పంపే మెయిల్ చాలా సెక్యూర్, హ్యాకర్లు కూడా క్రాక్ చేయలేరు
Gmail Whatsapp Feature : జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు జీమెయిల్ ఎవరికి పంపినా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. జీమెయిల్లో కూడా వాట్సాప్ మాదిరి సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. ఈ మేరకు గూగుల్ ఒక కీలక ప్రకటన చేసింది. జీమెయిల్ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇప్పటికే వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త సెక్యూర్ ఫీచర్ అందరి యూజర్లకు అందుబాటులో లేదు. ఈ సెక్యూర్ ఫుల్ అప్డేట్ అందుబాటులోకి వచ్చాక ఇమెయిల్ పంపేందుకు అదనపు సెక్యూరిటీ అవసరం లేదు. అదనపు సాఫ్ట్వేర్ లేదా ఎక్స్టెన్షన్ కూడా అవసరం ఉండదు. ఇమెయిల్‌లు సెక్యూర్ డెలివరీ అవుతాయి.
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏంటి?
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ప్రాథమికంగా ఒక డిజిటల్ సెక్యూరిటీ లాక్ సిస్టమ్. ఈ టెక్నాలజీతో ఏదైనా మెసేజ్ లేదా డేటాను పంపినవారు లేదా స్వీకరించినవారు తప్ప మరెవరూ ఒక ఇమెయిల్ లేదా మెసేజ్ ట్రాక్ చేయలేరు.
ఆండ్రాయిడ్ iOS డివైజ్‌లకు జీమెయిల్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సపోర్ట్‌ను విస్తరిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ అప్డేట్ ద్వారా యూజర్లు ఇప్పుడు జీమెయిల్ మొబైల్ యాప్ నుంచి నేరుగా ఎన్‌క్రిప్ట్ చేసిన ఈమెయిల్‌లను కంపోజ్ చేయడం, పంపడం, చదవడం చేయొచ్చు.
ఈ యూజర్లకు బెనిఫిట్ :
క్లయింట్-సైడ్ ఎన్క్రిప్షన్ అందించే గూగుల్ వర్క్‌స్పేస్ ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ఫీచర్ యాక్సెస్ చేసేందుకు ముందుగా అడ్మిన్ కన్సోల్ ద్వారా ఆండ్రాయిడ్ iOS సపోర్ట్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
ర్యాపిడ్ రిలీజ్, షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్లు రెండింటిలోనూ ఈ అప్డేట్ వచ్చిందని గూగుల్ పేర్కొంది. మొబైల్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అందుబాటులోకి వచ్చాక వినియోగదారులు ఎక్కడి నుంచైనా సెక్యూర్‌గా యాక్సెస్ చేయొచ్చు. గతంలో, ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్ కోసం డెస్క్‌టాప్ లేదా థర్డ్-పార్టీ టూల్స్ వాడాల్సి వచ్చేది.
