Apple Days Sale : ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఈ ఆపిల్ ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు..!
Apple Days Sale : ఆపిల్ ఐఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ భారీ తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. విజయ్ సేల్స్ లో ఇప్పుడే కొనేసుకోండి.
Apple Days Sale
- విజయ్ సేల్స్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 17 సిరీస్‌పై అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్
- ఐఫోన్ 17 ప్రో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై రూ. 4వేల వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు
- ఎంపిక చేసిన ఐఫోన్ 17 మోడళ్లపై రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్
Apple Days Sale : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారతీయ ఐఫోన్ అభిమానుల కోసం విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, ఇతర డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగుతుంది. ధరల తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సహా అనేక రకాల డిస్కౌంట్లను అందిస్తుంది.
ఈ తగ్గింపులతో ఐఫోన్ 17 సిరీస్‌కు కూడా వర్తిస్తాయి. అంతేకాదు.. కొనుగోలుదారులు లాయల్టీ రివార్డులు, తగ్గింపు ధరలతో ప్రొటెక్షన్ ప్లాన్లను కూడా పొందవచ్చు. మీరు ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. పూర్తి తగ్గింపు ధరలపై ఓసారి లుక్కేయండి.
ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గింపు :
ఈ సేల్‌లో బేస్ ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 78,790గా ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు స్టోర్లలో యాక్సిస్, ఐసీఐసీఐ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో రూ. 3వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అసలు ధర నుంచి మరింత తగ్గింపు పొందవచ్చు. అదనంగా, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ధర తగ్గింపు :
ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 124,190గా ఉంది. ఇందులో రూ. 4,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌తో పోలిస్తే ఈ ఐపోన్ ధర తక్కువకే లభిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర తగ్గింపు :
టాప్-ఎండ్ మోడల్ కావాలంటే ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ. 138,390 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లు పొందవచ్చు. ఇతర మోడళ్ల మాదిరిగానే కస్టమర్లు రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా డివైస్ వాల్యూ కూడా తగ్గుతుంది.
ఆపిల్ ఐఫోన్ 17e ధర తగ్గింపు :
ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 17ఇ రూ. 64,900 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు రూ. 60,490కే అందుబాటులో ఉంది. వినియోగదారులు స్టోర్‌లో రూ. 3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు, తద్వారా ధర రూ. 57,490కి తగ్గుతుంది. అదనంగా, కొనుగోలుదారులు 454 రివార్డ్ పాయింట్లతో పాటు రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
