Google Pixel 10 Deal : ఇది కదా డిస్కౌంట్.. ఈ పిక్సెల్ 10 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్..
Google Pixel 10 Deal : గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 3 బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- September 24, 2026 / 06:46 PM IST
Google Pixel 10 Deal
- అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు
- యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3వేలు ఆదా
- ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 3 రియర్ కెమెరాలు
Google Pixel 10 Deal : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలా? ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
పిక్సెల్ 10 ఫోన్ 120Hz డిస్‌ప్లే, టెన్సర్ G5 చిప్‌సెట్ భారీ బ్యాటరీతో వస్తుంది. కెమెరా ప్రియుల కోసం ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పిక్సెల్ 10 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ. 79,999 ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ కేవలం రూ. 67,400కే లభిస్తోంది. రూ. 12,599 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 64,400కు తగ్గుతుంది.
అమెజాన్ నెలకు కేవలం రూ. 2,370 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్, బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 36వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ కోరుకుంటే గూగుల్ పిక్సెల్ 10 బెస్ట్ ఫోన్. ఈ ధరలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. బయట వాడితే ఈ డిస్‌ప్లే 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. ప్యానెల్‌ను గీతలు పడకుండా ప్రొటెక్ట్ చేసేందుకు తయారీదారులు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను కూడా అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ జీ5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వినియోగదారులు 12GB వరకు ర్యామ్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎంచుకోవచ్చు. పిక్సెల్ 10లో 4,970mAh బ్యాటరీ కూడా ఉంది. అదనంగా 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ లెన్స్, 13MP అల్ట్రావైడ్ లెన్స్ 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 10.5MP సెన్సార్ అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అద్భుతంగా ఉంటుంది.
