Google Pixel 10 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే ఆఫర్.. క్రోమాలో జస్ట్..!

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు ప్రారంభ ధర కన్నా రూ. 10వేల వరకు తక్కువకే లభ్యమవుతోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 ( Illustration generated using AI )

  • గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10వేలు తక్కువకే
  • బ్యాంక్ కార్డులతో రూ. 5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్

Google Pixel 10 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 10 భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. గూగుల్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ ప్రారంభ ధర కన్నా రూ. 10వేల వరకు తక్కువకు కొనేసుకోవచ్చు. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా లభ్యమవుతున్నాయి.

గూగుల్ పిక్సెల్ 10పై ఈ డిస్కౌంట్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్ సేల్స్ సమయంలో అందుబాటులో ఉండదు. గూగుల్ పిక్సెల్ 10పై ఈ భారీ ధర తగ్గింపు క్రోమా సేల్ సమయంలో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

గూగుల్ పిక్సెల్ 10 ధర డిస్కౌంట్ :
గూగుల్ ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో 12GB ర్యామ్ + 256GB అనే సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ. 79,999కు లభిస్తుంది. క్రోమా ఈ ఫోన్‌ను రూ. 5వేల తక్కువకు లిస్ట్ చేసింది.

Read Also : Voltas 1.5 Ton Split AC : ఈ సమ్మర్‌లో కొత్త AC కావాలా..? వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీపై భారీ డిస్కౌంట్.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

అదనంగా, HDFC బ్యాంక్ కార్డులతో మరో రూ. 5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా గరిష్టంగా రూ. 10వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ఈ గూగుల్ ఫోన్‌ను రూ. 69,999కే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల అక్యూటా OLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కు సపోర్టు ఇస్తుంది. పిక్సెల్ ఫోన్ డిస్‌ప్లే కోసం గూగుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ 4,970mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 30W వైర్డ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డులతో వస్తుంది. అందులో ఫిజికల్, మరొకటి eSIM. IP68 వాటర్ డస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.