Google Pixel 10 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు!
Google Pixel 10 Price : గూగుల్ పిక్సెల్ 10 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఈ పిక్సెల్ 10 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 10 Price
Google Pixel 10 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ సేల్ ముగిసినప్పటికీ కొన్ని అద్భుతమైన డీల్స్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మీరు పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. కొత్తగా లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది.
ఫ్లాగ్‌షిప్ ఫోన్ అప్‌గ్రేడ్ (Google Pixel 10 Price) చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం, అమెజాన్ గూగుల్ పిక్సెల్ 10పై రూ. 12,300 కన్నా భారీ డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న పిక్సెల్ 10 డీల్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ పిక్సెల్ 10పై రూ.10,070 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర రూ.69,929కి తగ్గింది. దాంతో పాటు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.2,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు.
పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 6.3-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు 4,970mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10 హ్యాండ్‌సెట్‌లో మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్ అందించే 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా ఉంది.
