Google Pixel 10 : సూపర్ డిస్కౌంట్ మావా.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇంతకీ కొనాలా? వద్దా?

Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 15వేల లోపు ధరలో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10

  • అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 అతి చౌకైన ధరకే లభిస్తోంది
  • బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా అదనపు డిస్కౌంట్లు
  • క్లీన్ సాఫ్ట్‌వేర్, పవర్‌ఫుల్ కెమెరాలు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మీరు గూగుల్ పిక్సెల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 79,999 ధరతో లాంచ్ కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 15వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది.

బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఇంకా తగ్గించుకోవచ్చు. క్లీన్ సాఫ్ట్‌వేర్, అదిరిపోయే కెమెరాతో పిక్సెల్ ఫోన్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. మీరు పిక్సెల్ ఫ్యాన్స్ అయితే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే.. ఇలాంటి డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. అమెజాన్‌లో ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 ఫోన్ (Google Pixel 10) డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 ధర డిస్కౌంట్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 64,649కే లభిస్తోంది. అసలు ప్రారంభ ధర నుంచి రూ. 15,350 నేరుగా తగ్గింపు పొందవచ్చు.

HSBC క్రెడిట్ కార్డ్‌తో రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. నెలకు సుమారు రూ. 2,273 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్, బ్రాండ్ మోడల్, పర్ఫార్మెన్స్ ఆధారంగా రూ. 39వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.

Read Also : Tecno POVA 8 5G : ఫోన్‌లకే కొత్త కింగ్.. 8000mAh బ్యాటరీతో టెక్నో పోవా 8 5G ఎంట్రీ.. ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు!

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ టెన్సర్ G5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇందులో 4,970mAh బ్యాటరీ కూడా ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వరకు, స్క్రీన్ టాప్ బ్రైట్‌నెస్, 3,000 నిట్స్ వరకు ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 48MP ప్రధాన సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ 10.8MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
ఇప్పటివరకు గూగుల్ లాంచ్ చేసిన ఫోన్లలో పిక్సెల్ 10 అత్యంత అడ్వాన్స్ ఫోన్. టెన్సర్ G5 చిప్ రోజువారీ వాడకంలో కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇతర ఫోన్లతో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ చాలా స్లో ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అంతగా ఉండదు.

ఎల్టీపీఓ డిస్‌ప్లే లేకపోవడం ప్రీమియం లెవల్ అనిపించుకోదు. కాకపోతే.. పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ కన్నా ఆండ్రాయిడ్ క్లీన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ వంటి సాఫ్ట్‌వేర్‌ కోరుకునే వారికి పిక్సెల్ 10 అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.