×
Ad

Google Pixel 10 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతంటే?

Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. రూ. 11వేల తగ్గింపుతో పిక్సెల్ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

Google Pixel 10

  • భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.73,999కి లిస్టింగ్, ధర రూ.6,000 డిస్కౌంట్
  • బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మీరు గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. భారత మార్కెట్లో రూ. 79,999కు లాంచ్ అయిన పిక్సెల్ 10 ఇప్పుడు ఆన్‌లైన్‌లో రూ. 11వేల వరకు డిస్కౌంట్‌తో లభిస్తోంది.

క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్, ఆకట్టుకునే కెమెరాలు, ఏఐ ఆధారిత ఫీచర్లతో పిక్సెల్ 10 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు పిక్సెల్ 10 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.73,999కి లిస్ట్ అయింది. రూ.6వేలు నేరుగా ధర తగ్గింపు లభిస్తోంది. మీరు HDFB బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐపై రూ.5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.

Read Also : TVS Jupiter 110 : స్కూటర్ ప్రియులకు షాక్.. టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ ధరలు పెంపు.. పాత, కొత్త వేరియంట్ ధరలివే..

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 టెన్సర్ G5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, పిక్సెల్ ఫోన్ 4,970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. పిక్సెల్ 10 ఫోన్ 6.3-అంగుళాల OLED స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.