×
Ad

Google Pixel 10a : పండగ చేస్కోండి.. ఖతర్నాక్ ఫీచర్లతో పిక్సెల్ 10a వచ్చేసింది.. ధర మీ బడ్జెట్‌లోనే, ప్రీ-ఆర్డర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు

Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ వచ్చేసింది. సింగిల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి.

  • Published On : February 19, 2026 / 01:45 PM IST
1/8
Google Pixel 10a : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ ఎట్టకేలకు లాంచ్ అయింది. ఈ పిక్సెల్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 49,999 ఉంటుంది.
2/8
గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4 కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ సొంత చిప్‌సెట్ గూగుల్ టెన్సర్ G4 ద్వారా పవర్ పొందుతుంది. పూర్తి ఫీచర్లు, ప్రీ-ఆర్డర్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
3/8
ధర ఎంతంటే? : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ సింగిల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ధర రూ. 49,999కు కొనేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి పిక్సెల్ ఫోన్ అడ్వాన్స్ ఆర్డర్ చేసే కస్టమర్లు రూ. 3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 16, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లావెండర్, బెర్రీ, ఫాగ్, అబ్సిడియన్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
4/8
పిక్సెల్ ఫోన్ ఫీచర్లు : ఫీచర్ల విషయానికి వస్తే.. గూగుల్ కొత్త ఫోన్ 6.2-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1080x2424 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ అందిస్తుంది.
5/8
ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 182 గ్రాములు ఉంటుంది. 5000mAh బ్యాటరీతో 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
6/8
గూగుల్ టెన్సర్ G4 చిప్ : ఈ గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 48MP క్వాడ్ PD డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరాతో వస్తుంది. అదనంగా, హ్యాండ్‌సెట్ 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో వస్తుంది.
7/8
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. రెండు మైక్రోఫోన్‌లతో సహా మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు అందిస్తుంది.
8/8
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు : లాంచ్ ఆఫర్‌లో భాగంగా గూగుల్ ఎంపిక చేసిన HDFC బ్యాంక్ కార్డులతో రూ. 3వేలు ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్, రూ. 3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అందిస్తోంది.