Google Pixel 10a
Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 18న లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. భారత మార్కెట్లో అదే రోజున ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తుందని గూగుల్ ధృవీకరించింది. అధికారిక లాంచ్‌కు కొన్ని రోజుల ముందే ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. డిస్‌ప్లే అప్‌డేట్‌లు, కెమెరా వివరాలు, కలర్ ఆప్షన్లు, ధర అంచనా వంటి వివరాలు ఇప్పటికే రివీల్ అయ్యాయి.
మిడ్-రేంజ్ పిక్సెల్ 10ఎ గూగుల్ కోర్ పిక్సెల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ గత మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ, కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో రానుంది. లేటెస్ట్ నివేదికల ప్రకారం ఈ పిక్సెల్ ఫోన్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పిక్సెల్ 10a డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 6.3-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందించనుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
యూఎఫ్ఎస్ (UFS) 3.1 టెక్నాలజీతో ప్రాసెసర్ 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో రావొచ్చు. బ్యాటరీ విషయానికొస్తే.. లీక్‌లు 23W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5100mAh బ్యాటరీ ఉండొచ్చు.
పిక్సెల్ 10a కెమెరా సెటప్, డిజైన్ :
కెమెరా విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10aలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డిస్‌ప్లేలో కటౌట్‌లో 13MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. 2025లో లాంచ్ అయిన పిక్సెల్ 10a ఫోన్ కూడా పిక్సెల్ 10 సిరీస్ మాదిరిగా ఉంటుందని అంచనా. గూగుల్ ఇప్పటికే కలర్ వేరియంట్‌ను రివీల్ చేసింది. గతంలో లీక్ అయిన డేటా ప్రకారం.. మొత్తం 4 కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. అందులో అబ్సిడియన్, ఫాగ్, బెర్రీ, లావెండర్ ఉండొచ్చు.
భారత్‌లో పిక్సెల్ 10a ధర (లీక్) :
ప్రారంభ లీక్‌ల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ. 49,999 నుంచి ప్రారంభం కానుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ. 69వేలు ఉంటుందని అంచనా.