×
Ad

Google Pixel 9 Price : వారెవ్వా.. అదిరిపోయే ఆఫర్.. ఈ పిక్సెల్ 9పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

Google Pixel 9 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 9పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..

Google Pixel 9 Price

Google Pixel 9 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ రూ.79,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలుపై రూ.25వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ పిక్సెల్ 9 ఫోన్ (Google Pixel 9 Price) లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, గూగుల్ జెమిని ఏఐతో కొనుగోలు చేయొచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, మొత్తం డిస్కౌంట్ రూ. 35వేల వరకు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ : మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.41,400 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌ పొందవచ్చు.
ఫైనల్ వాల్యూ : మీ పిన్ కోడ్‌లోని ఎక్స్ఛేంజ్ సర్వీస్, పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
పిక్సెల్ 9A డీల్ : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9ఎ అసలు ధర రూ.44,999 నుంచి రూ.33వేలు తగ్గింపుతో లభిస్తుంది.

Read Also : Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే..!

గూగుల్ పిక్సెల్ 9 ముఖ్య ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 సింగిల్ స్టోరేజ్ (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్‌ కలిగి ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గూగుల్ రాబోయే ఏడు ఏళ్లకు OS అప్‌గ్రేడ్ అందిస్తుంది.
ప్రాసెసర్, డిస్‌ప్లే : ఈ పిక్సెల్ ఫోన్ 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా, స్పెసిఫికేషన్లు :
ఈ పిక్సెల్ ఫోన్‌లో కెమెరా హైలైట్, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం పిక్సెల్ ఫోన్ 10.5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
పిక్సెల్ 9 ఫోన్ 4700mAh బ్యాటరీ కలిగి ఉంది. 27W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా కలిగి ఉంది.