Google Pixel 9a Price : ఆఫర్ అదిరింది బ్రో.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 9a Price : గూగుల్ పిక్సెల్ 9aపై భారీ తగ్గింపు అందిస్తోంది. పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, టెన్సర్ G4 చిప్‌సెట్ ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంది.
- Sreehari A
- Published On : November 29, 2025 / 04:59 PM IST
Google Pixel 9a Price
Google Pixel 9a Price : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? బ్లాక్ ఫ్రైడే సేల్ మిస్ అయినా డోంట్ వర్రీ.. మీరు ఇప్పటికీ అద్భుతమైన డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లలో గూగుల్ పిక్సెల్ 9a డీల్ ఒకటి. కొన్ని నెలల క్రితమే లాంచ్ అయిన ఈ ఫోన్ అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. తద్వారా ధర రూ. 10వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది.
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ తగ్గింపు (Google Pixel 9a Price) ధరకే సొంతం చేసుకోవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, కెమెరా సామర్థ్యాలు, గూగుల్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వారికి అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం. ఇంతకీ ఈ అమెజాన్ ఆఫర్ ఎలా పొందాలి? పిక్సెల్ 9a ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 9a అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ.49,999కు ప్రవేశపెట్టింది. పిక్సెల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు మిడ్-రేంజ్ ఫోన్‌గా నిలిచింది. అమెజాన్‌లో ఈ పిక్సెల్ 9a ఫోన్ ఇప్పుడు రూ.42,370 వద్ద లిస్ట్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులకు రూ.7,629 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఈఎంఐ లావాదేవీల కోసం ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3వేలు తగ్గింపు లభిస్తుంది. తద్వారా మొత్తం రూ. 10,629 సేవింగ్స్ చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. 2700 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ ఫోన్‌కు గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ అద్భుతమైన పవర్ అందిస్తుంది.
ఏఐ ఫీచర్లు, గూగుల్ సిగ్నేచర్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ హ్యాండ్‌సెట్ 5100mAh బ్యాటరీతో వస్తుంది. 48MP మెయిన్ కెమెరా, బ్యాక్ సైడ్ 13MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు 13MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ అబ్సిడియన్, పింగాణీ, ఐరిస్, పియోనీ అనే 4 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
