AI Trust Rankings : అన్ని ఏఐలనూ నమ్మొచ్చా? ది బెస్ట్ ఏఐ కంపెనీ ఇదే.. నమ్మకంలో నెంబర్ వన్
AI Trust Rankings : ఏఐ కంపెనీలను నమ్మొచ్చా? అన్ని ఏఐలలో ఏది బెటర్? ది బెస్ట్ ఏఐ కంపెనీ అంటే ఏం చెబుతారు? అందరూ మెచ్చిన ఏఐ కంపెనీ ఇదేనట.. ఇప్పుడు నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.. ఆ కంపెనీ ఏంటో తెలుసా?
- Sreehari A
- Published on- August 21, 2026 / 01:11 PM IST
AI Trust Rankings
- టాప్ 10 విశ్వసనీయమైన ఏఐ కంపెనీలు
- టాప్ ర్యాంకు లిస్టులో నిలిచిన గూగుల్
- ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ కంపెనీలు వెనుకంజ
- 78వ స్థానంలో మెటా, డీప్ సీక్ 283వ స్థానం
AI Trust Rankings : ఏఐ రాజ్యం ఏలుతోంది.. ఎక్కడ చూసినా ఏఐ ఆధిపత్యమే.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఏఐ తెగ వాడేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు, ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకీ మనం వాడే ఏఐ నిజానికి నమ్మొచ్చా? అది మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఆన్ లైన్ లో దొరికే అన్ని ఏఐ టూల్స్ సెక్యూర్ వినే? అంటే నమ్మదగినవేనా? అంటే చెప్పలేం..
ఎవరిని అడిగినా మీ ఫేవరెట్ ఏఐ టూల్ అంటే టక్కున ఓపెన్ఏఐ చాట్ జీపీటీ అనేస్తారు ఇంకా చాలానే ఏఐ కంపెనీల టూల్స్ ఉన్నాయి.. ఇవన్నీ ఏఐ కంపెనీలను నిజంగా నమ్మొచ్చా? అంటే చాలామందికి ఇదే డౌట్ వచ్చి ఉండొచ్చు.. సైబర్ న్యూస్ కూడా దీనిపై రీసెర్చ్ చేసింది.
టాప్ 10 విశ్వసనీయమైన ఏఐ కంపెనీలను గుర్తించింది. ఏఐలో తోపు ఎవరు? నెంబర్ వన్ ఏఐ కంపెనీ ఏంటో చెప్పేసింది. అన్ని ఏఐలలో కన్నా గూగుల్ నమ్మకమైన ఏఐ కంపెనీగా ప్రకటించింది. ఈ లిస్టులో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీలు దీనికి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం..
టాప్ 10 లిస్టులో ఏఐ కంపెనీలివే :
సైబర్ న్యూస్ లిస్టు ప్రకారం.. యూజర్ల డేటాపై లాంగ్ టైమ్ ఆధారపడినప్పటికీ అత్యంత విశ్వసనీయమైన ఏఐ కంపెనీల ర్యాంకింగ్‌లో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన 10 కంపెనీల్లో కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు బయటకు వచ్చాయి. అందులో రెండో, మూడో ర్యాంకుల్లో క్రిస్ప్, ఫైర్ ఫ్లైస్ ఉండగా ఆ తర్వాత అత్యంత విశ్వసనీయమైన ఏఐ కంపెనీల్లో అడోబ్, మాగ్నిఫిక్, రైట్ సోనిక్, వెరీఫఐ, సేల్స్ ఫోర్స్, గ్రామర్లీ, లవబుల్ ఉన్నాయి.
ఓపెన్ఏఐ పరంగా పరిశీలిస్తే.. ఈ లిస్టులో 22వ స్థానంలో నిలిచింది. ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ ఇంకా వెనుకబడి 70వ స్థానానికి పరిమితమైంది. ఏఐ సెక్యూరిటీపై ఆంత్రోపిక్ ఫోకస్ పెట్టడం, అలాగే మార్కెట్ ఒత్తిడి కన్నా ప్రజా ప్రయోజనాలకే ఎక్కువ ప్రాయారిటీ ఇస్తామన్న ఈ కంపెనీకి ఈ ర్యాంకింగ్ రావడం గమనార్హం.. ఏఐ ఇండస్ట్రీలోని ఇతర ప్రముఖ కంపెనీల్లో 78వ స్థానంలో మెటా ఉండగా, చైనాకు చెందిన డీప్ సీక్ 283వ స్థానంలో నిలిచింది.
ట్రస్టబిలిటీని ఎలా లెక్కిస్తారంటే? :
నివేదికల ప్రకారం.. సైబర్ న్యూస్ ఏఐ కంపెనీలను 4 కీలక రంగాలలో రీసెర్చ్ చేసింది. ప్రధానంగా డేటా ప్రైవసీ, పారదర్శకత, భద్రత, ప్రభాభిప్రాయం ఆధారంగా ర్యాంకులను ఇచ్చింది. ఈ మూడు కేటగిరీలలో గూగుల్ 100/100 స్కోరు సాధించింది.
అయితే, ప్రజాభిప్రాయంలో కూడా 91/100 స్కోరు పొందింది. మరోవైపు.. 63శాతం కన్నా ఎక్కువ కంపెనీలు తమ ఏఐ మోడళ్లకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారో రివీల్ చేయడం లేదు.. అలాగే 65శాతం కంపెనీలు నిర్దిష్ట డేటా రిటెన్షన్ పీరియడ్స్ విస్మరించాయి.
ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ విషయానికొస్తే.. ఈ రెండు కంపెనీలు రిలీజ్ చేస్తున్న కొత్త పవర్ ఫుల్ టెక్నాలజీలు పరిశీలనలో ఉన్నాయి. అందుకే ఈ కంపెనీల ఏఐ సెక్యూరిటీపై ప్రజల్లో నమ్మకం బలపడలేదు.. టెక్నాలజీలో స్ట్రాంగ్ అయినంత మాత్రానా ప్రజల్లో కూడా నమ్మకాన్ని పెంచదని చెప్పాలి..
