Google Wallet : మీ ఆధార్ కార్డును గూగుల్ వ్యాలెట్‌లో ఇలా సింపుల్‌గా సేవ్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Google Wallet : గూగుల్ ఇండియా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ కార్డును గూగుల్ వాలెట్‌లో డిజిటల్ ఐడీగా సేవ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల నుంచి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే?
- Sreehari A
- Updated on- April 29, 2026 / 03:17 PM IST
Google Wallet
- గూగుల్ వ్యాలెట్‌లో సరికొత్త ఫీచర్ ఇదిగో
- గూగుల్ వ్యాలెట్‌లో ఆధార్ కార్డు స్టోర్ చేయొచ్చు తెలుసా?
- మొబైల్ ఫోన్ నుంచి డిజిటల్ ఆధార్ ఈజీగా షేర్ చేయొచ్చు
Google Wallet : గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ భారతీయ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ఇప్పుడు తమ ఆధార్ కార్డును గూగుల్ వాలెట్‌లో డిజిటల్ ఐడీగా సేవ్ చేసుకోవచ్చు. దాంతో వినియోగదారులు మొబైల్ ఫోన్‌ల నుంచి తమ ఐడెంటిటీ డేటాను ఈజీగా సేఫ్‌గా చూసుకోవచ్చు. ఇతరులతో షేర్ చేయొచ్చు. అయితే, ఈ డిజిటల్ ఆధార్, యూఐడీఏఐ జారీ చేసిన ఫిజికల్ ఆధార్ కార్డు రెండూ ఒకటే అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
అవసరమైన షరతులివే :
గూగుల్ వ్యాలెట్ కు ఆధార్ లింక్ చేసే ముందు ఇవి తప్పక పాటించండి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9 లేదా ఆపై వెర్షన్ ఉండాలి.
- ఫోన్‌కు తప్పనిసరిగా స్క్రీన్ లాక్ (పిన్, ప్యాటర్న్ లేదా బయోమెట్రిక్స్) సెట్ చేసి ఉండాలి.
- మీ ఫోన్‌లో mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయి ఉండాలి.
గూగుల్ వ్యాలెట్‌కి ఆధార్ కార్డును ఎలా యాడ్ చేయాలి? :
మీ ఆధార్ కార్డును లింక్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
- మీ ఫోన్‌లో (Google Wallet) యాప్‌ను ఓపెన్ చేయండి.
- “Add” బటన్‌పై క్లిక్ చేయండి
- ఐడీల లిస్టు నుంచి ఆధార్‌ను ఎంచుకోండి
- మీరు mAadhaar యాప్‌కి రీడైరెక్ట్ కీకూడదు
- సైన్ ఇన్ చేసి మీ ఐడెంటిటీని ధృవీకరించుకోండి
- ‘Add to Wallet’ పై ట్యాప్ చేసి గూగుల్ వ్యాలెట్ ఎంచుకోండి
- ‘Continue’పై ట్యాప్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
- వెరిఫికేషన్ ప్రాసెస్‌కు కొంత సమయం పడుతుంది
- ఈ సమయంలో మీ రిక్వెస్ట్ రివ్యూ చేస్తున్నామనే మెసేజ్ కనిపించవచ్చు
- ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ ఆధార్ కార్డు గూగుల్ వాలెట్‌కు యాడ్ అవుతుంది.
సపోర్టు చేసే ప్లాట్‌ఫారమ్‌లివే :
- ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (ఆండ్రాయిడ్ 9 లేదా ఆపై వెర్షన్)
- అన్ని ఫోన్లలో సేఫ్టీ స్క్రీన్ లాక్ (పిన్, ప్యాటర్న్, బయోమెట్రిక్స్) ఎనేబుల్ చేసి ఉండాలి.
- భారత్‌లో నివసిస్తూ ఆధార్ సేవలను పొందుతున్న వినియోగదారులు అర్హులు.
ఫీచర్లు :
- మీ ఫోన్ సేఫ్, ఎన్‌క్రిప్ట్ స్టోరేజీతో వస్తుంది
- పర్మిషన్స్ ఐడెంటిటీ వివరాలను షేర్ చేయొచ్చు
- సపోర్ట్ చేసే యాప్‌లలో ఆన్‌లైన్ వెరిఫికేషన్ కూడా ఉంది
- అవసరమైనప్పుడు QR కోడ్ లేదా NFC ద్వారా పర్సనల్‌గా వాడొచ్చు.
గూగుల్ వ్యాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా యాక్సెస్ చేయాలి?
- గూగుల్ వ్యాలెట్ ఓపెన్ చేయండి.
- మీ ఆధార్ కార్డు కోసం కిందికి స్క్రోల్ చేయండి
- వ్యూ, వెరిఫకేషన్ కోసం ట్యాప్ చేయండి.
- అవసరమైతే క్యూఆర్ కోడ్ లేదా NFC వాడండి.
- వాడే ముందు డేటా షేరింగ్‌ను రివ్యూ చేశాక అప్రూవల్ ఇవ్వొచ్చు.
