HMD Vibe 2 Pro 5G : చీపెస్ట్ ఫోన్ బ్రో.. HMD వైబ్ 2 ప్రో 5G భలే ఉందిగా.. 6000mAh బ్యాటరీతో ధర జస్ట్ రూ.14,999కే..!

HMD Vibe 2 Pro 5G : హెచ్ఎండీ వైబ్ 2 ప్రో 5జీ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. 6000mAh బ్యాటరీతో ఈ ఫోన్ ధర కేవలం రూ.14,999కే లభిస్తుంది. పూర్తి ఆఫర్, ఫీచర్ల వివరాలివే..

HMD Vibe 2 Pro 5G

  • ఈ ఫోన్ సేల్‌లో రూ. 5,142 చొప్పున 3 ఈఎంఐలో కొనేసుకోవచ్చు..
  • హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ 6.78-అంగుళాల HD+ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ 16, 6000mAh భారీ బ్యాటరీ సెటప్

HMD Vibe 2 Pro 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. భారత మార్కెట్లో అత్యంత చౌకైన ధరకే కొత్త హెచ్ఎండీ వైబ్ 2 ప్రో 5జీ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సమయంలో ఈ హెచ్ఎండీ 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.

ఈ ఫోన్‌లో సోనీ సెన్సార్‌తో 64MP మెయిన్ కెమెరా ఉంది. 6000mAh భారీ బ్యాటరీతో రన్ అవుతుంది. ఇందులో సర్వం ఏఐ సపోర్ట్ కూడా ఉంది. హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ సేల్‌లో (FBBD) ఆఫర్ కింద ఈ ఫోన్‌ను ఏ ధరకు సొంతం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

భారత్‌లో ధర ఎంతంటే? :
హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ అమ్మకాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు . ఈ ఫోన్ లిస్టు ధర రూ.15,999 మాత్రమే.. ధర ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర రూ.29,999తో లాంచ్ అయింది. కానీ లిస్టు ధర రూ.15,999గా ఉంది. అయితే, ఈ ఫోన్‌ ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Read Also : Amazon Great Indian Festival Sale : సూపర్ ఆఫర్ భయ్యా.. ఆపిల్ వాచ్ సిరీస్ 11 మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యాంక్ ఆఫర్ :

హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ ఫోన్‌ హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ. 14,999కే పొందవచ్చు. ఈ ఫోన్‌ను ఈఎంఐలో కొనుగోలు చేస్తే నెలకు రూ. 5,142 చెల్లించాలి. అలాగే 3 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ బాక్స్‌లో ఛార్జర్, USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్, జెల్లీ కేస్ కూడా వస్తాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2460 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ కెమెరాలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ సెన్సార్ 64MP సోనీ IMX682 సెన్సార్ ఉండగా, 2MP మాక్రో కెమెరా కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.1, GPS/AGPS/Galileo, USB టైప్-C, WiFi 802.11 a/b/g/n/ac ఉన్నాయి. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.