Holi 2022 : హ్యాపీ హోలీ.. మీ ప్రియమైన వారికి వాట్సాప్ హోలీ స్టిక్కర్లను పంపుకోండిలా..!

Holi 2022 : వాట్సాప్ తమ యూజర్లకు హోలీ శుభాకాంక్షలు చెబుతోంది. హోలీ పండుగ సందర్భంగా యూజర్ల కోసం ప్రత్యేకించి హోలీ స్టిక్కర్లను ఆఫర్ చేస్తోంది.

Holi 2022 : వాట్సాప్ తమ యూజర్లకు హోలీ శుభాకాంక్షలు చెబుతోంది. హోలీ పండుగ సందర్భంగా యూజర్ల కోసం ప్రత్యేకించి హోలీ స్టిక్కర్లను ఆఫర్ చేస్తోంది. ఈ వాట్సాప్ హోలీ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉచితంగా పంపుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే ఈ రంగుల పండుగ రోజున వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లు దూరంగా ఉన్న హోలీ విషెస్ చెప్పుకునేందుకు సరికొత్త విభిన్నమైన వాట్సాప్ హోలీ స్టిక్కర్లను అందిస్తోంది. మీరు మీరు ఎవరికైనా వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్‌ల (WhatsApp Holi Stickers)ను పంపడం ద్వారా హోలీ 2022 (Holi 2022) శుభాకాంక్షలు తెలియజేయొచ్చు. బోరింగ్ టెక్స్ట్ మెసేజ్‌లు కాకుండా రంగురంగుల హోలీ స్టిక్కర్లను మీ ప్రియమైన వారికి పంపుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ నుంచి Happy Holi Stickers ఎలా పంపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Holi 2022 : వాట్సాప్ స్టిక్కర్‌లను పంపండి ఇలా..
– హోలీ స్టిక్కర్లు’ కోసం Google Play స్టోర్‌లో సెర్చ్ చేయండి. ఏదైనా మంచి యాప్‌ను ఎంచుకోండి
– ఆ యాప్ రేటింగ్ ఎలా ఉంది.. ఎలాంటి ఫీచర్‌లు ఉన్నాయో చూసి ఎంచుకోవచ్చు).
– మీరు ఆ హోలీ స్టిక్కర్ల ప్యాకేజీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
– మీ WhatsApp యాప్‌కి స్టిక్కర్ ప్యాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనవారికి పంపుకోవచ్చు.
– మీ వాట్సాప్ అప్లికేషన్‌కు స్టిక్కర్ ప్యాక్‌లను యాడ్ చేయాలంటే.. ‘+’ (ప్లస్ సైన్) లేదా ‘యాడ్’ బటన్‌ను నొక్కండి.
– మీరు డౌన్‌లోడ్ చేసిన ప్యాక్ నుంచి స్టిక్కర్‌ను పంపుకోవచ్చు.

Holi 2022 Here’s How You Can Send Whatsapp Stickers To Your Loved Ones 

– WhatsApp యాప్ ఓపెన్ చేసి.. మీరు స్టిక్కర్‌ను పంపాలనుకుంటున్న చాట్‌కి వెళ్లండి.
– ఎమోజి విండోను ఓపెన్ చేయండి. టైప్ బాక్స్‌కు ఎడమవైపు ఉన్న ఎమోజి ఐకాన్‌పై నొక్కండి.
– GIFలు, మరిన్ని స్టిక్కర్‌ల కోసం మరో రెండు స్లాట్‌లు ఉన్నాయి.
– మూడవ చివరి sign ఎంచుకుంటే.. మీరు మీ అన్ని స్టిక్కర్ ప్యాక్‌లను చూడవచ్చు.
– చివరిగా, స్టిక్కర్‌ని పంపేందుకు ఆ బటన్‌పై నొక్కండి.
మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు హోలీ 2022 స్టిక్కర్‌లను పంపుకోవచ్చు.

అదేవిధంగా, మీరు ఏదైనా పండుగ వాట్సాప్ స్టిక్కర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WhatsAppకి మరిన్ని స్టిక్కర్ ప్యాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. మీరు సాంప్రదాయ వాట్సాప్ స్టిక్కర్లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హోలీ 2022 సందర్భంగా మీ ప్రియమైన వారందరికీ శుభాకాంక్షలు చెప్పవచ్చు.

Read Also : Chappal Holi : హోలీ రోజు అక్కడ చెప్పులతో కొట్టు కుంటారు

ట్రెండింగ్ వార్తలు