Honor Play 20A : బడ్జెట్‌లో భారీ బ్యాటరీ.. ఫోన్ వెనుకే మరో స్క్రీన్.. హానర్ ప్లే 20A వచ్చేసిందోచ్!
Honor Play 20A : హెచ్ఎండీ, హానర్ ప్లే 20A అనే కొత్త ఫోన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 25, 2026 / 05:13 PM IST
Honor launches Play 20A
- హానర్ ప్లే 20A 6.9-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది
- 13MP ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీ సెటప్
- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలివే
Honor Play 20A : హెచ్ఎండీ, కొత్త ఫోన్ హానర్ ప్లే 20A వచ్చేసింది. ప్రస్తుతం హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ లిస్టు అయింది. హానర్ ప్లే 20A బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ G81 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హానర్ ప్లే 20A ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
హానర్ ప్లే 20A ధర ఎంతంటే? :
హానర్ ప్లే 20A ధర లభ్యతను హానర్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ హానర్ అధికారిక సైట్‌లో లిస్ట్ అయింది. హానర్ ప్లే 20A మిడ్‌నైట్ బ్లాక్, లైట్ బ్లూ స్టార్రీ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
హానర్ ప్లే 20A ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హానర్ ప్లే 20A ఫోన్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ G81 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వెబ్ బ్రౌజింగ్, మెసేజింగ్ వీడియో స్ట్రీమింగ్‌కు సరిపోయే ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్. ఇతర ఫీచర్లలో యాక్సిలరోమీటర్ సెన్సార్ కూడా ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హానర్ ప్లే 20A ఫోన్ బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెకండరీ కెమెరా వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm జాక్, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
