Honor Magic 9 Series : 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ స్పెసిఫికేషన్లు లీక్..!

Honor Magic 9 Series : ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే 3 మోడళ్లు లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published on- September 27, 2026 / 08:53 PM IST

Honor Magic 9 Series

  • మ్యాజిక్ 9 ప్రో మాక్స్‌లో భారీ 6.8-అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ డిస్‌ప్లే
  • ఈ ఫోన్ IP68, IP69 IP69K రేటింగ్‌లతో రావచ్చు
  • 16GB + 512GB వేరియంట్ ధర 5999 యువాన్లు (రూ. 85వేలు)

Honor Magic 9 Series : హానర్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ ముందే కీలక స్పెసిఫికేషన్లన్నీ వెల్లడయ్యాయి. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ సెప్టెంబర్ 28న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ అనే 3 మోడళ్లు ఉంటాయని సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ప్రారంభ ధరలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు, ఈ సిరీస్‌లోని 3 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. హానర్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మాక్స్, మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ సిరీస్‌లలోని 3 మోడళ్లు సెప్టెంబర్ 28న లాంచ్ కానున్నాయి. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

హానర్ మ్యాజిక్ 9 :
ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9 అత్యంత కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్. 6.37-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావచ్చు. స్నాప్‌డ్రాగన్ 8E5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ ఉంటుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ఇందులో 55MP స్క్వేర్ సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు. ఆండ్రాయిడ్‌లో ఇలాంటి కెమెరా రావడం ఇదే ఫస్ట్ టైమ్..

ఈ ఫోన్ మెయిన్ కెమెరా 200MP ఉండొచ్చు. 50MP అల్ట్రావైడ్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండొచ్చు. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్‌ను అమర్చవచ్చు. ఈ ఫోన్ బయోమెట్రిక్ సెక్యూరిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండొచ్చు. 16GB + 512GB వేరియంట్ ధర 5,999 యువాన్లు (సుమారుగా రూ. 85వేలు) ఉంటుంది.

హానర్ మ్యాజిక్ 9 ప్రో మాక్స్ :

మ్యాజిక్ 9 ప్రో మ్యాక్స్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.8-అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8EE6 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 8800mAh బ్యాటరీ ఉంటుంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా.

Read Also :  Motorola Signature : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా సిగ్నేచర్‌ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

కెమెరాల విషయానికొస్తే..
ఫ్రంట్ సైడ్ 55MP స్క్వేర్ 1:1 సెన్సార్ కెమెరా ఉంటుందని అంచనా. బ్యాక్ సైడ్ 1/1.28-అంగుళాల సెన్సార్‌తో 200MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటాయని భావిస్తున్నారు. హానర్ 3డీ అల్ట్రాసోనిక్ సెన్సార్ 3డీ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్లను కూడా చేర్చవచ్చు. ఈ ఫోన్ IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తుందని అంచనా.

హానర్ మ్యాజిక్ 9 సూపర్ ఎడిషన్ ఈ రెండింటి కన్నా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో పెద్దదైన 6.81-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8E5 చిప్‌సెట్ ఉంటాయి. ఈ ఫోన్‌లోని అతిపెద్ద ఆకర్షణ 11,000mAh బ్యాటరీ. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనా. బ్యాక్ సైడ్ 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP 3x టెలిఫోటో కెమెరా ఉంటాయని అంచనా. ఇందులో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. 8.1mm మందం 227 గ్రాముల బరువు ఉంటుందని అంచనా.