Honor Pad X9 Max : 10,100mAh భారీ బ్యాటరీతో 13-అంగుళాల హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ లాంచ్.. ధర ఎంతంటే?
Honor Pad X9 Max : కొత్త హానర్ టాబ్లెట్ చూశారా? 10,001mAh భారీ బ్యాటరీతో అదిరిపోయేలా ఉంది. 13-అంగుళాల భారీ డిస్‌ప్లేతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- July 26, 2026 / 05:37 PM IST
Honor Pad X9 Max
- హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 చిప్‌సెట్
- ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10
- ఆటోఫోకస్ చేయగల 5MP రియర్ కెమెరా సెటప్
Honor Pad X9 Max : కొత్త హానర్ టాబ్లెట్ వచ్చేసింది. హానర్, ప్యాడ్ X9 మ్యాక్స్ పేరుతో కొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్‌లో 13-అంగుళాల డిస్‌ప్లే, భారీ బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. డీసీ డిమ్మింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
TÜV రైన్‌ల్యాండ్ వారి లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ టాబ్లెట్ 6GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 6s 4జీ జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హానర్ ప్యాడ్ X9 టాప్ ధర :
యూకేలో హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ 4GB+128GB వేరియంట్ ధర £349.99 (సుమారుగా రూ. 45వేలు) నుంచి (Honor Pad X9 Max) ప్రారంభమవుతుంది. 6GB+256GB వేరియంట్ ధర £449.99 (సుమారుగా రూ. 58వేలు) ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హానర్ ప్యాడ్ ఎక్స్9 కొనేసుకోవచ్చు.
హానర్ ప్యాడ్ X9 మాక్స్ స్పెసిఫికేషన్లు :
హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్‌లో 2500 x 1560 పిక్సెల్ రిజల్యూషన్‌తో 13-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ టాబ్లెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 700 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది.
Read Also : Vivo V70 FE 5G : పండగ చేస్కోండి.. ఈ వివో 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..
కంపెనీ ఇందులో పేపర్-లైక్ డిస్‌ప్లే వ్యూయింగ్ మోడ్ కూడా చేర్చింది. డీసీ డిమ్మింగ్‌కు సపోర్టు ఇస్తుంది. TÜV రైన్‌ల్యాండ్ లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. స్క్రీన్-టు-బాడీ రేషియో 88 శాతంగా ఉంది. హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 6s 4జీ జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు.
ఈ టాబ్లెట్ 10,100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 13 గంటల వరకు రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10తో వస్తుంది.
ఈ టాబ్లెట్‌లో ఆటోఫోకస్‌తో 5MP రియర్ కెమెరా ఉంది. కంపెనీ 5MP ఫ్రంట్ కెమెరా అందించింది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 5, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సి ఉన్నాయి. కంపెనీ హానర్ మ్యాజిక్ పెన్సిల్ 4s స్టైలస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. సౌండ్ అవుట్‌పుట్‌లో ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్‌డ్ సపోర్ట్‌తో 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ కొలతలు 297.62 x 192.72 x 6.72mm, బరువు 618 గ్రాములు ఉంటుంది.
