Honor X9e Launch : 8,560mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు నో టెన్షన్!

Honor X9e Launch : హానర్ X9e స్మార్ట్‌ఫోన్ 8,560mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ధర, కెమెరా, ప్రాసెసర్, పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Honor X9e Launch

భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. హానర్ X9e లాంచ్
8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఫీచర్లు అదుర్స్
3 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర తెలిస్తే షాకవుతారు

Honor X9e Launch : స్మార్ట్‌ఫోన్ తెగ వాడేవాళ్లకు బ్యాటరీ విషయంలో ఇక టెన్షన్ తగ్గనుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) భారీ బ్యాటరీతో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హానర్ X9e పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో ఏకంగా 8,560mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించింది.

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను హానర్ మధ్యప్రాచ్య మార్కెట్లో లాంచ్ చేసింది. ఫోన్ డిజైన్ హానర్ టర్బో 5జీ మాదిరిగా ఉండగా, ఫీచర్లు కూడా దాదాపు అదే రేంజ్ ఉన్నాయి.

ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. ధర 1,499 సౌదీ రియాల్స్ ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ.38వేలు ఉంటుంది. డాన్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : OnePlus Turbo 6Vs Launch : 9,000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ టర్బో 6Vs వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

కొనుగోలుపై సుమారు రూ.7,500 విలువైన గిఫ్టులు కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో హానర్ కాఫీ కప్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, బ్యాటరీ కెపాసిటీపై ఒక ఏడాది గ్యారెంటీ అందిస్తుంది.

హానర్ X9e ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కేవలం 7.76mm మందంతో ఉండే ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్10పై రన్ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే.. :
బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ, 5MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అమోల్డ్ డిస్‌ప్లేతో హానర్ X9e ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.