Mother’s Day 2026 : మదర్స్ డే స్పెషల్ : AIతో నిమిషాల్లో అమ్మ కోసం క్యూట్ WhatsApp స్టిక్కర్ క్రియేట్ చేయడం ఎలా?
Mother’s Day 2026 : హ్యాపీ మదర్స్ డే సందర్భంగా ఏఐతో సొంతంగా వాట్సాప్ స్టిక్కర్లను సింపుల్‌గా ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫుల్ డిటెయిల్స్
- Sreehari A
- Published on- May 10, 2026 / 11:43 AM IST
Custom WhatsApp Stickers ( Image Credit : Gemini AI )
- మదర్స్ డే రోజున ఏఐ, ఫ్యామిలీ ఫొటోలతో కస్టమ్ వాట్సాప్ స్టిక్కర్లు రెడీ
- ఏఐతో వాట్సాప్ స్టిక్కర్లు సొంతంగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసా?
- వాట్సాప్ లోనే నేరుగా మదర్స్ డే స్టిక్కర్లను నిమిషాల్లో రెడీ చేయొచ్చు
Mother’s Day 2026 : హ్యాపీ మదర్స్ డే.. 2026 మాతృదినోత్సవం సందర్భంగా వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ స్పెషల్ స్టిక్కర్ ఫీచర్ ద్వారా అదిరిపోయే స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇప్పుడు తమ ఫ్యామిలీ ఫోటోలు, ఏఐ (AI) ఫొటోలను ఉపయోగించి కస్టమైజడ్ స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ నేరుగా వాట్సాప్ యాప్‌లోనే వర్క్ అవుతుంది.
ఈ మదర్స్ డే నాడు కేవలం వాట్సాప్ మెసేజ్ పంపడమే కాదు.. వాట్సాప్‌లో సొంతంగా స్టిక్కర్లు కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటోలు, ఏఐ ఆర్ట్‌వర్క్ ద్వారా సొంతంగా పర్సనల్ మెసేజ్‌తో కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయొచ్చు. ఈ స్టిక్కర్ల కోసం ఎలాంటి థర్డ్-పార్టీ యాప్ అవసరం లేదు. స్టిక్కర్‌లను వాట్సాప్‌లోనే క్రియేట్ చేసి నేరుగా మీ అమ్మకు పంపవచ్చు. మీకు నచ్చిన ఏఐ స్పెషల్ స్టిక్కర్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అవుతాయి.
వాట్సాప్‌లో సొంత స్టిక్కర్‌ను ఎలా క్రియేట్ చేయాలి? :
కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసేందుకు యూజర్లు ముందుగా ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత, పర్సనల్ లేదా ఫ్యామిలీ చాట్‌ను ఓపెన్ చేసి మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ఎమోజీ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. స్టిక్కర్స్ సెక్షన్‌కు వెళ్లి క్రియేట్ లేదా (+)ను ఎంచుకోండి. ఆ తర్వాత, స్టిక్కర్‌గా మార్చేందుకు ఫొటోను ఎంచుకోండి.
వాట్సాప్ ఆటోమేటిక్‌గా ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్లు స్టిక్కర్‌కు టెక్స్ట్, ఎమోజీలు డూడుల్స్‌ను యాడ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత స్టిక్కర్‌ను వెంటనే పంపవచ్చు. ఈ ఏడాదిలో మదర్స్ డేను జరుపుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
AIతో అద్భుతమైన స్టిక్కర్లు :
వాట్సాప్ ఇప్పుడు భారత్ సహా చాలా దేశాల్లో ఏఐ స్టిక్కర్ సపోర్ట్‌ను అందిస్తోంది. కేవలం టెక్స్ట్ టైప్ చేసి కొత్త స్టిక్కర్‌ను క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా ‘Warm Mother’s Day Pic’ లేదా ‘Watercolour Mother Portrait’ వంటి ప్రాంప్ట్‌ను టైప్ చేస్తే.. ఏఐ ప్రాంప్ట్ ఆధారంగా స్పెషల్ స్టిక్కర్‌ను క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ‘Best Mother Ever,’ ‘Happy Mother’s Day,’ లేదా ‘Thanks Mom’ వంటి స్పెషల్ మెసేజ్ యాడ్ చేయొచ్చు.
థర్డ్ పార్టీ యాప్ ఇలా వాడండి :
వాట్సాప్ ద్వారా ఇప్పుడు సొంతంగా స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ అడ్వాన్స్ స్టిక్కర్ల కోసం థర్డ్-పార్టీ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. WhatSticker, Stickify, Sticker.ly వంటి యాప్‌లు బాగా పాపులర్. iOS, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అన్నింటిలో లభ్యమవుతున్నాయి.
