Google Maps : గూగుల్ మ్యాప్స్.. మీ ప్రతి లొకేషన్ సేవ్ చేస్తోందా? అర్జెంట్‌గా ట్రాకింగ్ ఆపేయండి.. పాత డేటా ఇలా డిలీట్ చేయండి!
Google Maps : గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్ హిస్టరీని సేవ్ చేస్తుంది. ఇంతకీ ఎలా ఆఫ్ చేయాలి? పాత డేటాను ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published On : April 6, 2026 / 08:34 PM IST
Google Maps
- గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ హిస్టరీ ఫీచర్ ట్రాక్ చేస్తుంది
- మీరు లొకేషన్ హిస్టరీని కూడా ఆఫ్ చేయవచ్చు
- పాత హిస్టరీని మాన్యువల్‌గా లేదా ఆటో-డిలీట్ చేయొచ్చు
Google Maps : మీరు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే, ఇది మీకోసమే. మీరు గూగుల్ మ్యాప్స్ వాడే సమయంలో మీ లొకేషన్ హిస్టరీ గూగుల్ సేవ్ చేస్తుంది తెలుసా? చాలావరకూ మీకు తెలియకుండానే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేస్తుంటుంది.
చాలావరకూ మీ లొకేషన్‌కు సంబంధించిన డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో సేవ్ చేస్తుంది. ‘లొకేషన్ హిస్టరీ’ ఫీచర్ ద్వారా గూగుల్ మీ లొకేషన్‌లు, రూట్‌లు, టైమ్‌లైన్‌ను రికార్డ్ చేస్తుంది. తద్వారా మీకు ట్రావెల్ హిస్టరీ, కస్టమైజడ్ ఇండికేషన్లు, మెరుగైన నావిగేషన్‌ను అందిస్తుంది.
అయితే, ప్రతి కదలిక రికార్డు సేవ్ అవ్వడాన్ని అందరూ ఇష్టపడరు కాబట్టి, ఇది చాలా మంది వినియోగదారులకు గోప్యతా సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, గూగుల్ మీ లొకేషన్ హిస్టరీని సేవ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే, దానిని ఆఫ్ చేయడం ఒక ముఖ్యమైన సెట్టింగ్ కావచ్చు. మంచి విషయం ఏమిటంటే, మీరు దీన్ని కొన్ని సులభమైన దశల్లోనే నియంత్రించవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో ఎలా లొకేషన్ డేటా డిలీట్ చేయాలంటే? :
- గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ హిస్టరీని ఎలా ఆఫ్ చేయాలి
- మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- టాప్ రైడ్ సైడ్ ప్రొఫైల్ ఫోటో/ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
- ‘Your Timeline’ లేదా ‘Settings’కు వెళ్లండి.
- పైన ఉన్న మూడు చుక్కలపై నొక్కండి
- ” లొకేషన్ & ప్రైవసీ సెట్టింగ్‌లు ” కు వెళ్లండి
- ఇక్కడ మీరు ‘ టైమ్‌లైన్ ‘ మీద ట్యాప్ చేయాలి .
- ఆ తర్వాత మీ గూగుల్ ఖాతాను ఎంచుకుని సైన్ ఇన్ చేయండి .
- మీరు మీ టైమ్‌లైన్‌ను ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు .
ఆ తర్వాత, గూగుల్ మీ కొత్త లొకేషన్ హిస్టరీని ఇకపై సేవ్ చేయదు. అయితే, మీ పాత లొకేషన్ హిస్టరీ మాత్రం అలాగే ఉంటుంది. మీరు ఆ పాత డేటా కూడా డిలీట్ చేయొచ్చు.
పాత లొకేషన్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి? :
- గూగుల్ మ్యాప్స్‌లో ప్రొఫైల్ ఫొటో/ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
- ఇప్పుడు ‘Your Timeline’ లేదా ‘Settings’కు వెళ్లండి.
- పైన ఉన్న త్రి డాట్స్ ట్యాప్ చేయండి.
- ‘Location & privacy’కు వెళ్లండి.
- ” టైమ్‌లైన్ డేటా మొత్తాన్ని Turn Off ఆప్షన్ ఎంచుకోండి
‘Delete all Timeline Data’పై ట్యాప్ చేసి నిర్దిష్ట తేదీని లేదా రేంజ్ కూడా డిలీట్ చేయొచ్చు. ఆటో-డిలీట్ టైమ్‌లైన్ ఆప్షన్ కూడా ఉంది. నిర్దిష్ట సమయం తర్వాత లొకేషన్ ఆటోమాటిక్‌గా డిలీట్ చేస్తుంది.
- ‘Location And privacy’ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
- ‘Auto-delete’ ఆప్షన్ ఎంచుకోండి
- 3 నెలలు / 18 నెలలు / 36 నెలల నుంచి ఎంచుకోండి
- పాత హిస్టరీని ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తుంది
లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేయడం వల్ల టైమ్‌లైన్, కొన్ని కస్టమైజడ్ ఫీచర్‌లు పనిచేయవు. గూగుల్ ఇప్పటికీ ఇతర సెట్టింగ్‌ల వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ద్వారా లొకేషన్ డేటాను యాక్సస్ చేస్తుంది.
