Internet Issue : ఫుల్ సిగ్నల్.. కానీ నెట్ లేదు? మీ ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే చాలు!

Internet Issue : మీ ఫోన్‌కు ఫుల్ సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ రావడం లేదా? కొన్ని సెట్టింగ్స్ చెక్ చేయండి. ఇలా చేస్తే మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ ఫిక్స్ అవ్వొచ్చు.

Internet Issue

  • మీ మొబైల్‌లో ఇంటర్నెట్ సమస్య ఉందా?
  • ఫుల్ నెట్‌వర్క్ సిగ్నల్ ఉన్నా కూడా నెట్ ఇష్యూనా?
  • ఈ సింపుల్ సెట్టింగ్స్ చెక్ చేస్తే క్షణాల్లో ఇష్యూ ఫిక్స్

Internet Issue : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఆగిపోయిందా? ఫోన్ ఫుల్ సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ డేటా పనిచేయడం లేదా? అయితే, ఇది నెట్ వర్క్ సెట్టింగ్స్ ఇష్యూ కావొచ్చు. మీకు కూడా ఇలాంటి ఇష్యూ ఎదురైతే ఇలా చేయండి.. కొన్నిసార్లు ఈ ఇష్యూ సాధారణ ఫోన్ సెట్టింగ్‌తో ఫిక్స్ అవుతుంది.

మీరు షాపింగ్ చేసేటప్పుడు ఏదైనా పేమెంట్లు చేయడం లేదా వీడియో కాలింగ్, ఇతర అవసరాల వరకు ఇంటర్నెట్ తప్పనిసరి. ఇలాంటి పరిస్థితిలో మీ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ చెక్ చేయాలి. అప్పుడు మీకు ఇంటర్నెట్ ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. మీరు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫోన్ సెట్టింగ్స్ ఇలా మార్చండి :
ఫస్ట్ మీ రోజువారీ మొబైల్ డేటా ఉందో లేదో చూడండి. ఈ ఇష్యూ ఎక్కువగా ప్రీపెయిడ్ (Internet Issue) యూజర్లకు ఉంటుంది. ఎందుకంటే వారికి లిమిటెడ్ రోజువారీ డేటా లిమిట్ ఉంటుంది. కొన్నిసార్లు, రోజువారీ డేటా లిమిట్ అయిపోతే కూడా ఇంటర్నెట్ ఇష్యూ వస్తుంది

Read Also : BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. రోజుకు 3GB డేటా, 365 రోజులు ఫుల్ మజా..!

అలాగే, మీరు రోమింగ్‌లో ఉంటే.. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో డేటా రోమింగ్ ఆఫ్ చేసినా కూడా ఇంటర్నెట్‌ రాదు. ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, ‘Mobile Internet’ సెక్షన్ కింద డేటా రోమింగ్ టోగుల్‌ను ఆన్ చేయండి.

సిమ్ స్లాట్‌ చెక్ చేశారా? :
ఈ ఫోన్ సెట్టింగ్స్ మార్చిన తర్వాత కూడా మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇష్యూ అలాగే ఉందా? మీ ఫోన్ నంబర్ సిమ్ కార్డ్ ఫస్ట్ స్లాట్‌లో పెట్టారో లేదో చెక్ చేయండి. ఒకవేళ పెట్టకపోతే మీ ఫోన్‌ను ఆఫ్ చేసి సిమ్ కార్డ్‌ను తీసి మళ్లీ అదే ఫస్ట్ స్లాట్‌లో పెట్టండి.

ఇంటర్నెట్ వర్క్ అవుతుందో లేదో ఓసారి చెక్ చేయండి. ఇప్పటికీ ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీ ఫోన్‌ను ఏర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి 10 సెకన్ల తర్వాత డిసేబుల్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్ నెట్‌వర్క్ రిఫ్రెష్ అవుతుంది. మీ ఫోన్ నెట్ మళ్లీ ఎప్పటిలాగే పనిచేస్తుంది.

ఇంటర్నెట్ ఇంకా వర్క్ చేయకుంటే మీ ఫోన్‌ను వెంటనే రీస్టార్ట్ చేసి చూడండి. తద్వారా కనెక్టివిటీ సమస్యలు ఫిక్స్ అవుతాయి. లేదంటే మీ దగ్గరలోని టెలికాం ఆపరేటర్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడం బెటర్.