WhatsApp Message History : వారెవ్వా.. కిర్రాక్ ఫీచర్.. వాట్సాప్‌లో మీ చాట్ హిస్టరీ మొత్తం గ్రూప్‌కి పంపొచ్చు తెలుసా? స్టెప్ బై స్టెప్ ఫుల్ గైడ్..

WhatsApp Message History : గ్రూప్ చాట్‌ల కోసం కొత్త వాట్సాప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్‌ వచ్చేసింది. ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంది.

WhatsApp Message History

  • వాట్సాప్ గ్రూప్ మెసేజ్ హిస్టరీని అడ్మిన్‌లు ఎనేబుల్ చేయవచ్చు
  • ఈ హిస్టరీ ఫీచర్ ఆండ్రాయిడ్, iOSలో అందుబాటులో ఉంది
  • కొత్త గ్రూప్ సభ్యులకు గత మెసేజ్ చదువుకోవచ్చు.

WhatsApp Message History : వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. గ్రూప్ చాట్‌ల కోసం కొత్త వాట్సాప్ మెసేజ్ హిస్టరీ ఫీచర్‌ అందుబాటులో ఉంది తెలుసా? ఈ ఏడాది ఫిబ్రవరి 20లోనే వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్ ఇప్పుడు చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉంది.

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లు రెండింటిలోనూ యాక్సస్ చేయొచ్చు. చాలా కాలంగా, వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అయ్యే కొత్త మెంబర్లు గత గ్రూపు చాట్స్ వివరాలను చూడలేకపోతున్నామని కంప్లయింట్ చేస్తున్నారు.

జాయిన్ అయ్యేవరకు గ్రూపులో ఏం జరిగిందో తెలిసే పరిస్థితి లేదు. ఈ కొత్త ఫీచర్‌తో గతంలో చాట్స్ మెసేజ్ హిస్టీరిని కూడా తెలుసుకోవచ్చు. గ్రూప్ అడ్మిన్‌లు కొత్త మెంబర్లకు మెసేజ్ హిస్టరీని షేర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు, గ్రూపులో చేరిన తర్వాత కొత్త మెసేజ్ మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడు పాత మెసేజ్ హిస్టరీ కూడా చూసేందుకు ఆప్షన్ ఉందనమాట.

Read Also : PF Withdrawal : వావ్.. ఇక UPI, ATM ద్వారా మీ PF డబ్బులు తీసుకోవచ్చు.. కొత్త లిమిట్ ఎంతో తెలుసా?

మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయితే.. కొత్త మెంబర్స్ మెసేజ్ విషయంలో ఫిర్యాదు చేస్తే.. ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ హిస్టరీని పంపేందుకు మీ కోసం చాలా సింపుల్ గైడ్ అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ మెసేజ్ హిస్టరీని గ్రూప్‌కి ఎలా పంపాలి? :

  • వాట్సాప్ ఓపెన్ చేసి మీ మెసేజ్ హిస్టరీ కోసం గ్రూప్ చాట్‌కి వెళ్లండి.
  • ఆపై స్క్రీన్ పైభాగంలో ఉన్న గ్రూప్ పేరును ట్యాప్ చేయండి.
  • వాట్సాప్ హోమ్ స్క్రీన్ నుంచి గ్రూప్ చాట్‌పై ఎక్కువసేపు ట్యాప్ చేసి పట్టుకోండి.
  • ఆ తర్వాత More Options> Group Infoకు వెళ్లండి.
  • ఇప్పుడు ఆ కొత్త సభ్యుడి కోసం సెర్చ్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
  • ఆ తర్వాత, మెసేజ్ హిస్టరీని ట్యాప్ చేయండి.
  • మీరు పంపాలనుకునే పాత మెసేజ్ సంఖ్యను ఎంచుకోండి.
  • చివరగా, (Add Members)పై ట్యాప్ చేసి (Continue)పై క్లిక్ చేయండి.

iOSలో వాట్సాప్ మెసేజ్ హిస్టరీని పంపాలటే? :

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • మీరు మెసేజ్ హిస్టరీని పంపాలనుకునే గ్రూప్ చాట్‌కి వెళ్లండి లేదా ఎక్కువసేపు ట్యాప్ చేసి పట్టుకోండి.
  • ఇప్పుడు, Add (+) బటన్‌పై క్లిక్ చేయండి.
  • కాంటాక్ట్ లేదా నంబర్‌ను సెర్చ్ చేసి ఎంచుకోండి.
  • ఆ తర్వాత, మెసేజ్ హిస్టరీ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  • మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ల సంఖ్యను ఎంచుకోండి.
  • ఇప్పుడు Done బటన్‌పై క్లిక్ చేసి Confirm చేయండి.
  • ఆపై (Add Members)పై ట్యాప్ చేసి (Continue)పై క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్, iOSలో వాట్సాప్ మెసేజ్ హిస్టరీని ఆన్/ఆఫ్ చేయడం ఎలా? :

  • మీరు మెసేజ్ హిస్టరీని ఇలా ఆన్/ఆఫ్ చేయవచ్చు
  • గ్రూప్ పేరును ట్యాప్ చేయండి.
  • గ్రూప్స్ పర్మిషన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • పంపిన మెసేజ్ హిస్టరీ సెక్షన్ కు వెళ్లండి.
  • మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.