AI Impact Summit 2026 : ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ డే 2 : పబ్లిక్ కోసం ఫ్రీ ఎంట్రీ పాస్.. మీరు వెళ్లాలనుకుంటే ఇలా పాస్ పొందొచ్చు!
AI Impact Summit 2026 : భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండో రోజున ప్రజల కోసం ప్రత్యేకంగా ఉచింతా ఎంట్రీ పాస్ అందుబాటులో ఉంటుంది. ఈ పాస్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
AI Impact Summit Day 2
- రెండో రోజు నుంచి ప్రజల కోసం ఫ్రీ ఎంట్రీ పాస్
- భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సెషన్లు
- వీవీఐపీల రాకతో మధుర రోడ్డు, భైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్డు సమీపంలో భారీ రద్దీ
- పబ్లిక్ ఎంట్రీ ఫ్రీ, రిజిస్ట్రేషన్లు మాత్రం ఫుల్
- ఆన్లైన్లో అదనపు స్లాట్ల తిరిగి తెరిస్తేనే పాస్ పొందొచ్చు
AI Impact Summit Day 2 : భారత్ ఫస్ట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సాధారణ ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా మొదటి రోజు భారీ రద్దీ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ప్రపంచ నేతలు, సాంకేతిక ప్రముఖులు, స్టార్టప్‌ల ముందు తమ లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించాయి.
ఈ సమ్మిట్ రెండో రోజు నుంచి సాధారణ ప్రజలు కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. జేపీ నడ్డా, సుందర్ పిచాయ్ ఇతరులతో సహా అనేక మంది అతిథులు ఈ వేదికగా కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. మీరు రెండో రోజు భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్లాన్ చేస్తుంటే.. ట్రాఫిక్ అడ్వైజరీ, ఫ్రీ పాస్‌లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డే 2 : పబ్లిక్ ఎంట్రీ, వెన్యూ, టైమింగ్స్ ఇవే :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈరోజు నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏఐ మెగా ఈవెంట్‌కు ప్రాథమిక వేదిక న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపం కొన్ని కార్యక్రమాలు చాణక్యపురిలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరుగుతాయి. ప్రధానంగా ఉన్నత స్థాయి విధాన సెమినార్లు ఇందులో నిర్వహిస్తుంటారు. ఈ సెమినార్లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగుస్తాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డే 2 : ట్రాఫిక్ అడ్వైజరీ :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2వ రోజున వీవీఐపీలు ఎక్కువ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మధుర రోడ్, భైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్లలో భారీ రద్దీగా ఉంది. అడపాదడపా రోలింగ్ మూసివేతలు ఉండొచ్చు.
నార్త్ నుంచి సౌత్ వైపు వెళ్లే ప్రయాణికులు రింగ్ రోడ్ లేదా సారాయ్ కాలే ఖాన్ మీదుగా ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్లే వారు బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. సాధారణ ప్రజలు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి ఉచితంగా హాజరు కావచ్చు. అయితే, లిమిటెడ్ స్పేస్ కారణంగా వ్యక్తిగత రిజిస్ట్రేషన్లు ఫిల్ అయిపోయాయని అధికారిక వెబ్సైట్ సూచిస్తుంది.
ఫ్రీ పాస్ ఎలా పొందాలి :
- అధికారిక వెబ్సైట్ (impact.indiaai.gov.in) విజిట్ చేయండి.
- ముందుగా ‘Register as Delegate’ ఎంచుకోండి. ఆపై “Register Now” క్లిక్ చేయండి.
- మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి.
- మీ రీసెంట్ ఫొటోను కూడా అప్లోడ్ చేయొచ్చు.
- ఇమెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మీ ఇన్‌బాక్స్‌కు పంపిన OTP ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత, మీ డిజిటల్ ఎంట్రీ పాస్‌గా QR కోడ్‌తో కన్ఫార్మేషన్ ఇమెయిల్ వస్తుంది.
- ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ ఏఐ సమ్మిట్ లోపలికి ఎంట్రీ పొందవచ్చు.
