LPG Cylinder Shortage : నో గ్యాస్.. నో ఇండక్షన్.. ఇంట్లో ఈ 5 సూపర్ కిచెన్ టాప్స్ ట్రై చేయండి.. క్షణాల్లో వంట రెడీ..!

LPG Cylinder Shortage : గ్యాస్ లేదా? ఇండక్షన్ స్టవ్స్ కూడా దొరకట్లేదా? డోంట్ వర్రీ.. మార్కెట్లో ఈ రెండు లేకున్నా 5 సింపుల్ కుకింగ్ టాప్స్ ద్వారా మీకు నచ్చిన వంటను క్షణాల్లో వండుకోవచ్చు..

  • గ్యాస్ కొరత ఉన్నా ఇండక్షన్ స్టవ్ లేకున్నా వంట ఫాస్ట్
  • మార్కెట్లో చౌకైన ధరలో సూపర్ బెస్ట్ కిచెన్ కుకింగ్ హీటర్లు
  • గ్యాస్ కొరతతో ఇండక్షన్ కుక్కర్లకు డిమాండ్, నో స్టాక్

LPG Cylinder Shortage : బాబోయ్ గ్యాస్ కష్టాలు.. ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ గురించే టాపిక్.. గ్యాస్ సిలిండర్ కోసం జనమంతా ఎగబడుతున్నారు. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ అంటూ తెగ ఆరాటపడిపోతున్నారు. వాస్తవానికి, దేశంలో గ్యాస్ కొరత ఉందా లేదా అనేది కన్నా ఆ భయంతోనే ముందుగా గ్యాస్ బుకింగ్ చేసేస్తున్నారు.

గ్యాస్ బుకింగ్ చేసినా తొందరగా వస్తుందనే గ్యారెంటీ లేదు.. ఈలోపు ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి? అని కంగారపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడం, బయట మార్కెట్ రేటు కన్నా ఎక్కువ పెట్టి కొనేందుకు వెనుకాడటలేదు.

ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్ :
గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా ఇప్పుడు ఇండక్షన్ కుక్ టాప్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చాలా నగరాల్లో మాత్రం ఈ ఇండక్షన్ స్టవ్ ల కోసం జనం ఎగబడటంతో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా స్టాక్‌ అయిపోయింది. నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగితే అమెజాన్‌లో ఒక్క రోజే 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్‌లు అమ్ముడయ్యాయి.

ఈ డిమాండ్ కారణంగా పలుచోట్ల ‘Out of Stock’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్లలో కూడా ఈ ఇండక్షన్ కుక్కర్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు బదులుగా ఇంకా ఏమైనా ఉన్నాయా? అని చూస్తున్నారు. వంట కోసం వాడే 5 ఐదు అద్భుతమైన అప్లియన్సెస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : Book LPG Cylinder : గ్యాస్ అయిపోయిందా? ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సిలిండర్.. సింపుల్ బుకింగ్ ఆప్షన్లు.. ఫాస్ట్ డెలివరీ!

ఎయిర్ ఫ్రైయర్ :
ఎయిర్ ఫ్రైయర్లలో కూడా ఫుడ్ వండుకోవచ్చు. సాధారణంగా వేయించడం, బేకింగ్ చేసేందుకు వాడుతారు. చాలా తక్కువ నూనె పడుతుంది. అనేక కొత్త ఎయిర్ ఫ్రైయర్ మోడల్స్ టేస్టీ పనీర్, గ్రిల్డ్ చికెన్, బేక్డ్ స్నాక్స్‌లు కూడా చేయొచ్చు. భారత మార్కెట్లో ఎయిర్ ఫ్రైయర్ ధరలు బ్రాండ్, ఫీచర్లు కెపాసిటీ బట్టి రూ. 2,500 నుంచి రూ. 15వేల వరకు ఉంటాయి.

మైక్రోవేవ్ ఓవెన్ :
మైక్రోవేవ్ ఓవెన్‌లలో కూడా వండుకోవచ్చు. ముఖ్యంగా పాస్తా, కూరగాయలు, సూప్‌లు, బియ్యం వంటి పూర్తి వంటకాలను హీట్ చేసి వండుకోవచ్చు. మీ ఫుడ్ గ్రిల్ చేసి రోస్ట్ కూడా చేయొచ్చు. మార్కెట్లో మైక్రోవేవ్ ఓవెన్ ధరలు బ్రాండ్, ఫీచర్లు, కెపాసిటీ బట్టి రూ. 5,000 నుంచి రూ. 80,000 వరకు ఉంటాయి.

రైస్ కుక్కర్ :
బియ్యం వండేందుకు రైస్ కుక్కర్ అద్భుతంగా ఉంటుంది. పవర్ ఉంటే చాలు.. పులావ్, కిచిడి, ఉడికించిన కూరగాయలతో రుచికరమైన ఫుల్ రెడీ చేయొచ్చు. మార్కెట్లో ఈ రైస్ కుక్కర్ ధర రూ. 1,500 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.

ఎలక్ట్రిక్ కుకింగ్ హీటర్ :
ఎలక్ట్రిక్ కుకింగ్ హీటర్ అనేది హాట్ ప్లేట్ అని కూడా అంటారు. పాత స్టవ్ మాదిరిగా పనిచేస్తుంది. పవర్ తోనే నడుస్తుంది. సరసమైన ఎలక్ట్రిక్ కుకింగ్ హీటర్లు రూ. 2,000 నుంచి రూ. 3,000 మధ్యలో దొరుకుతాయి.

ఎలక్ట్రిక్ పాన్ :
ఈ ఎలక్ట్రిక్ పాన్ అనేది ఇంటర్నల్ హీటింగ్ ఎలిమెంట్ తో వస్తుంది. గుడ్లు, నూడుల్స్, కూరగాయలను వేయించుకోవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధర సుమారు రూ. 1,000 నుంచి అందుబాటులో ఉన్నాయి.