Internet Shutdown Apps : ఇరాన్ కేబుల్స్ కట్ చేస్తుందట..! లో ఇంటర్నెట్, నో ఇంటర్నెట్‌తో పనిచేసే యాప్స్ ఇవే..

Internet Shutdown Apps : ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మోసుకెళ్లే సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లపై నియంత్రణలు విధించాలనే దిశగా ఇరాన్ యోచిస్తున్నట్టు సమాచారం.. అదేజరిగితే ఇంటర్నెట్ కట్ అయినట్టే..

Internet Shutdown Apps ( Image Credit : AI )

  • వెస్ట్ ఆసియా వార్ టెన్షన్.. భారత్‌లో నెట్ ఆఫ్ అయితే కాపాడేది ఈ యాప్‌లే!
  • మొబైల్‌లో ఇవి ఉంటే చాలు.. నెట్ బంద్ అయినా మీరు సేఫ్!
  • ఇంటర్నెట్ ఆగితే దేశం ఆగుతుందా? ముందే ఈ స్మార్ట్ యాప్‌లు రెడీగా పెట్టుకోండి

Internet Shutdown Apps : ఇక ఇంటర్నెట్ ఉండదా? ఒకసారి ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి.. జస్ట్ ఊహిస్తేనే అంతా శూన్యంగా అనిపిస్తుంది కదా.. అలాంటి పరిస్థితే భవిష్యత్తులో రాబోతుంది. త్వరలో ఇంటర్నెట్ షట్ డౌన్ కాబోతుందా అంటే.. అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలే దీనికి అసలు కారణంగా చెప్పవచ్చు. ఈ ఉద్రికత్తలు పెరుగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి (Internet Shutdown Apps) సమీపంలోని సీక్రెట్ ఇంటర్నెట్ చోక్‌పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మోసుకెళ్లే సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లు అన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి. ఈ మార్గంలో ఇరాన్ నియంత్రణలు విధించే దిశగా పరిశీలిస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అదేగానీ జరిగితే ఇంటర్నెట్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం లేకపోలేదు. కనెక్టివిటీ, ఆన్‌లైన్ పేమెంట్లు, క్లౌడ్ సర్వీసులు లేదా మెసేజింగ్ యాప్‌లలో తాత్కాలికంగా డౌన్ లేదా బ్రేక్ ఔట్ ఏర్పడితే, యూజర్లకు ఇంటర్నెట్ కనెక్టవిటీ కట్ అయినట్టే.

అందుకే ఆ ఎమర్జెన్సీ పరిస్థితి రావడానికి ముందే అందరూ రెడీగా ఉండాల్సిన సమయం. ఈ పరిస్థితుల్లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా పనిచేసే 4 యాప్‌లను ప్రతి భారతీయులు ఫోన్లలో రెడీగా పెట్టుకోవడం బెటర్. కమ్యూనికేషన్, నావిగేషన్ వంటి అవసరాలు సహా అన్ని పనులకు ఉపయోగపడతాయి.. ఇంతకీ ఆ యాప్స్ ఏంటి? ఎలా ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన ఎమర్జెన్సీ రెడీ యాప్‌లివే :

ఆర్గానిక్ మ్యాప్స్ (మ్యాప్స్ నావిగేషన్) :
ఈ యాప్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమే లేదు. ఇదో సింగిల్ GPS నావిగేషన్ యాప్ ఈ యాప్ ద్వారా అన్‌లిమిటెడ్ మ్యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రియల్ వరల్డ్ పరిస్థితులను కూడా డిస్‌ప్లే చేస్తుంది. తద్వారా మీ మార్గాన్ని నావిగేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది.

Read Also : Samsung Galaxy S25 FE : ఈ శాంసంగ్ ఫోన్ చాలా చీప్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,000 తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

డ్రైవింగ్, వాకింగ్, సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్, వాయిస్ గైడెన్స్‌ను కూడా అందిస్తుంది. కానీ, యూజర్లను ట్రాక్ చేయదు. ఎలాంటి యాడ్స్ చూపదు. బ్యాక్‌గ్రౌండ్ డేటా కలెక్ట్ చేయదు. ప్రైవసీ పరంగా చాలా బెస్ట్ యాప్.

బ్రియార్ (మెసేజింగ్ యాప్‌లు ) :
ఈ ఆండ్రాయిడ్ యాప్ ఆఫ్‌లైన్ మెసేజింగ్ కోసం బెస్ట్. ఎందుకంటే.. టెక్స్ట్ పంపేందుకు ఇందులో బ్లూటూత్, వై-ఫై లేదా టోర్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఈ యాప్ ఇంటర్నెట్ లేకుండానే మీ సమీపంలోని కాంటాక్ట్‌లతో కనెక్ట్ అవుతుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, లోకల్ స్టోరేజ్ వంటి సేఫ్ ఫీచర్లను కూడా అందిస్తుంది. అయితే, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే ఈ బ్రియార్ యాప్ సపోర్టు చేస్తుంది.

జెల్లో (వాకీ-టాకీ యాప్) :
ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌ను వాకీ-టాకీగా మార్చేస్తుంది. తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీతో రన్ అవుతుంది. మీరు నేరుగా లేదంటే గ్రూప్ చాటింగ్స్ జరపవచ్చు. ఫొటోలు, టెక్స్ట్‌లు, లొకేషన్‌లు, అలర్ట్‌లను కూడా పంపవచ్చు. ఈ యాప్ ఇయర్‌బడ్స్, స్పీకర్ మైక్స్ వంటి వేరబుల్ డివైజ్‌లకు కూడా సపోర్టు చేస్తుంది. జెల్లో 14 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందిస్తుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ యాప్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

పాకెట్‌పాల్ ఏఐ (ఏఐ చాట్‌బాట్) :
ఈ ఏఐ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు. నెట్ కనెక్షన్ లేకుండా ఏఐ చాట్‌బాట్ యాప్ రన్ అవుతుంది. ఏఐ మోడల్స్‌తో ఈజీగా మీరు చాటింగ్ చేయొచ్చు. ఈ యాప్‌లో హగ్గింగ్‌ఫేస్ నుంచి వందలాది ఓపెన్-సోర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. టెంపరేచర్, కాంటెక్స్ట్ లెన్త్, సిస్టమ్ ప్రాంప్ట్‌ల వంటి మోడల్ పారామీటర్‌లపై ఫుల్ కంట్రోలింగ్ అందిస్తుంది.