iOS 27 Update : ఆపిల్ ఫ్యాన్స్ అలర్ట్..! AI ఫీచర్లతో iOS 27 వస్తోంది.. ఈ లిస్ట్‌లో మీ ఐఫోన్ ఉందా? చెక్ చేసుకోండి!
iOS 27 Update : ఆపిల్ జూన్ 8న iOS 27 రిలీజ్ చేస్తోంది. ఈ అప్‌డేట్ అనేక కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను తీసుకురావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈసారి కొన్ని పాత ఐఫోన్ మోడళ్లకు ఈ అప్‌డేట్ అందకపోవచ్చు.
- Sreehari A
- Published on- June 6, 2026 / 07:08 PM IST
iOS 27 Coming June 8
- ఐఫోన్ యూజర్ల కోసం కొత్త iOS 27 అప్‌డేట్ రిలీజ్
- ఈ నెల 7న ఆపిల్ WWDC 2026 ఈవెంట్లో ప్రకటించే ఛాన్స్
- పాత ఐఫోన్ మోడళ్లకు కొత్త అప్‌డేట్ అందదు
- ఏ ఐఫోన్ మోడళ్లకు iOS 27 సపోర్టు చేస్తుందంటే?
iOS 27 Update : ఆపిల్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఈ ఏడాదిలో అతి త్వరలో ఆపిల్ WWDC 2026 ఈవెంట్ జరగనుంది. జూన్ 8న జరగబోయే ఈ ఆపిల్ బిగ్ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం iOS 27ను ఆవిష్కరించనుంది. ఇందులో అనేక కొత్త ఏఐ ఫీచర్లు, అప్‌గ్రేడ్ సిరి ఉంటాయని అంచనా. అయితే, కొంతమంది ఐఫోన్ యూజర్లకు నిరాశనే చెప్పాలి. కొత్త లీక్ ప్రకారం.. కొన్ని పాత ఐఫోన్ మోడళ్లకు iOS 27 అప్‌డేట్ అందదు. మీ ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి..
ఈ ఐఫోన్ మోడళ్లకు iOS 27 రానట్టే :
ఈసారి ఆపిల్ iOS 27 సపోర్ట్‌ను ఐఫోన్ 12 సిరీస్, ఆపై మోడళ్లకు మాత్రమే ఉండొచ్చు. ఇది నిజమైతే ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ మోడళ్ల యూజర్లకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టు ఉండదు. ఒకవేళ వారికి iOS27 రాకున్నా ఆపిల్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, బగ్ ఫిక్స్‌లను అందిస్తుంది.
ఏ ఐఫోన్‌లకు కొత్త అప్‌డేట్? :
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 సిరీస్‌ల అన్ని మెయిన్ మోడళ్లకు iOS 27 అప్‌డేట్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. థర్డ్ జనరేషన్ ఐఫోన్ SE, రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌లు కూడా ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అందుకుంటాయని అంచనా.
Read Also : Car Insurance : వరదల్లో కారు దెబ్బతింటే వెంటనే ఇలా చేయండి.. బీమా క్లెయిమ్ ప్రాసెస్, కవరేజ్ వివరాలివే!
ఈ లిస్టు డేటా కేవలం లీకైన రిపోర్టుల ఆధారంగా మాత్రమే. ఫైనల్ లిస్టు WWDC 2026లో ఆపిల్ ప్రకటించనుంది. ఐఫోన్ యూజర్లు జూన్ 8వ తేదీ వరుకు ఆగాల్సిందే..
iOS27 సపోర్ట్ చేసే ఐఫోన్‌ల లిస్టు ఇదే :
- ఐఫోన్ 12 సిరీస్
- ఐఫోన్ 12
- ఐఫోన్ 12 మినీ
- ఐఫోన్ 12 ప్రో
- ఐఫోన్ 12 ప్రో మాక్స్
- ఐఫోన్ 13 సిరీస్
- ఐఫోన్ 13 మినీ
- ఐఫోన్ 13 ప్రో
- ఐఫోన్ 13 ప్రో మాక్స్
- ఐఫోన్ 14
- ఐఫోన్ 14 ప్లస్
- ఐఫోన్ 14 ప్రో
- ఐఫోన్ 14 ప్రో మాక్స్
- ఐఫోన్ 15
- ఐఫోన్ 15 ప్లస్
- ఐఫోన్ 15 ప్రో
- ఐఫోన్ 15 ప్రో మాక్స్
- ఐఫోన్ 16
- ఐఫోన్ 16 ప్లస్
- ఐఫోన్ 16 ప్రో
- ఐఫోన్ 16 ప్రో మాక్స్
- ఐఫోన్ 16e
- ఐఫోన్ 17
- ఐఫోన్ 17 ఎయిర్
- ఐఫోన్ 17 ప్రో
- ఐఫోన్ 17 ప్రో మాక్స్
- ఐఫోన్ SE
- ఐఫోన్ SE (3వ జనరేషన్)
- ఐఫోన్ 18 సిరీస్ (లాంచ్ తర్వాత)
ఈ ఐఫోన్‌లకు కొత్త అప్‌డేట్ రాదు :
- ఐఫోన్ 11
- ఐఫోన్ 11 ప్రో
- ఐఫోన్ 11 ప్రో మాక్స్
- ఐఫోన్ SE (2వ జనరేషన్ )
స్పెషల్ అట్రాక్షన్‌గా ఏఐ ఫీచర్లు :
ఈసారి, iOS27లో ఏఐ ఫీచర్లు ఎక్కువగా ఉండొచ్చు. నివేదికల ప్రకారం.. ఆపిల్ సిరి వర్చువల్ అసిస్టెంట్‌ను సరికొత్తగా అందించనుంది. కొత్త సిరి నేచురల్ కన్వర్జేషన్ అర్థం చేసుకోగలదు. సందర్భాన్ని ఈజీగా గ్రహించగలదు. ఇతర యాప్‌లతో లోతుగా ఎనలైజ్ చేయగలదు. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను ఫొటోలు, కెమెరా, వాలెట్ షార్ట్‌కట్స్ వంటి యాప్‌లకు కూడా విస్తరించవచ్చు.
ఐఫోన్ యూజర్లు కేవలం టెక్స్ట్ కమాండ్‌లతో ఫొటోలను ఎడిట్ చేయొచ్చు. సింపుల్ లాంగ్వేజీలో ప్రాంప్ట్స్ ద్వారా కొత్త షార్ట్‌కట్‌లను క్రియేట్ చేయొచ్చు. కెమెరా యాప్‌లో కూడా పెద్ద మార్పు రానుంది.
